pizza
The first glimpse of Chaavu Kaburu Challage under the collaboration of Allu Aravind, Karthikeya, Bunny Vas GA2 Pictures gets a stunning response
అల్లు అర‌వింద్‌, కార్తికేయ‌, బ‌న్నివాసు,జిఏ2 పిక్చ‌ర్స్ - "చావుక‌బురుచ‌ల్ల‌గా విజువ‌ల్ స‌ర్‌ప్రైజ్ కి హ్యూజ్ రెస్పాన్స్‌
You are at idlebrain.com > news today >
 
Follow Us

21 September -2020
Hyderabad


Presented by ace producer Allu Aravind, and produced by successful producer Bunny Vas, Chaavu Kaburu Challaga has energetic hero Karthikeya and Lavanya Tripathi in the lead roles. Debut director Koushik Pegallapati is at the helm for the commerical entertainer. The first glimpse video of the film was released today on the occasion of Karthikeya's birthday and it has garnered a unanimously positive response from all quarters. This video highlights Karthikeya who plays Basthi Balaraju and his mass portrayal has caught the attention of cine enthusiasts. The first glimpse was unveiled at 11:47 AM today, September 21st. Karthikeya's attire, dialect and attitude are the main assets of the first glimpse. GA2 Pictures and Bunny Vas seem to have another box office winner on the cards. On the occasion, the movie unit wished a happy birthday to Karthikeya.

Speaking on the occasion, Bunny Vas said, "Bhale Bhale Magadivoi, Geetha Govindam, and Prathi Roju Pandage which were produced by us became box office blockbusters. The expectations are high on us and we are working to match the same. We wanted Chaavu Kaburu Challaga to be completely different to Karthikeya's previous films and he moulded himself to suit the role perfectly. He is a very dedicated actor and we are very satisfied with the output. The storyline that was narrated by our director caught our attention and it will offer something new to the audience. More surprises will be out in the days to follow."

Cast:
Karthikeya, Lavanya Tripathi, Aamani, etc.

Technical crew:

Presented by: Allu Aravind
Banner: GA2 Pictures
Producer: Bunny Vas
Co-producer: Sunil Reddy
Editor: Satya G
Art: GM Sekhar
Cinematography: Sunil Reddy
Additional dialogues: Siva Kumar Bhujala
Production designer: Manisha A Dutt
Costume designer: Mouna Gunmadi
PRO: Eluru Sreenu
Executive producer: Sharath Chandra Naidu, Raghava Karuturi
Music: Jake's Bejoy
Director: Koushik Pegallapati

 

ఎస్‌ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రుస విజ‌యాల‌తో కేరాఫ్ స‌క్స‌స్ బ్రాండ్ ని సొంతం చేసుకున్న యంగ్‌ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా, హ్యాపెనింగ్ ఎన‌ర్జిటిక్ హీరో కార్తీకేయ‌, ల‌క్కీ బ్యూటీ లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం "చావుక‌బురుచ‌ల్ల‌గా". ‌ టైటిల్ తోనే అటు చిత్ర ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో, ఇటు సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుల్లో ఈ చిత్రానికి అనూహ్య స్పంద‌న ల‌‌భించడం విశేషం. దాంతో పాటే విడుద‌ల చేసిన హీరో కార్తికేయ పోషించిన "బ‌స్తి బాల‌రాజు" ఫ‌స్ట్ లుక్ సైతం సోష‌ల్ మీడియాలో ఫుల్ ఫుల్ క్రేజ్ అందుకుంది. అయితే ఈ నెల 21న కార్తికేయ బ‌ర్త్‌డే సంద‌ర్బంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా జిఏ2 పిక్చ‌ర్స్ వారు కార్తికేయ ని ఏం వ‌రం కావాలో కొరుకొ అన్నారు. దానికి కార్తికేయ నాకు టీజ‌ర్ ఇవ్వండి అని అడ‌గ‌గా ఒవ‌ర్ టు డైర‌క్ట‌ర్ అంటూ జిఏ2 నుండి రిప్లై రావ‌టం దాని వెంట‌నే ద‌ర్శ‌కుడు స‌ర్‌ప్రైజ్ అంటూ ఎనౌన్స్ చేశారు. ఇదంతా ఫాలో అవుతున్న నెటిజ‌న్స్ ఆ స‌ర్‌ప్రైజ్ కొసం ఎదురు చూసారు. ఈరోజు 11.47 నిమిషాల‌కి విడుద‌ల చేసిన ఈ విడియో స‌ర్‌ప్రైజ్ కి నిజంగా స‌ర్‌ప్రైజ్ అయ్యారు. కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రి మాడ్యూలేష‌న్ చూస్తే మ‌ళ్ళి చూడాల‌నిపించేలా వుందంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి. అంతే కాదు ఆమ‌ని, భ‌ద్రం వేసిన డైలాగ్స్ కూడా సామాన్య ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌ర‌గా వున్నాయి. ఈ విజువ‌ల్ చాలా క్యూట్ గా వుండ‌ట‌మే కాకుండా బన్నివాసు, జిఏ2 పిక్చ‌ర్స్ స్టాండ‌ర్స్ మ‌రోక్క‌సారి నిరూపించేలా వుండ‌టం విశేషం. ఈ సంద‌ర్బంగా చిత్ర యూనిట్ అంతా హీరో కార్తికేయ కి జ‌న్మ‌దిన‌శుభాకాంక్ష‌లు తెలిపారు.

నిర్మాత బ‌న్నివాసు గారు మాట్లాడుతూ.. జిఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో భ‌లేభ‌లే మ‌గాడివోయ్‌, గీతాగోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే చిత్రాలు ఘ‌న‌విజాయాలు సాధించాయి. అలాంటి బ్యాన‌ర్ లో వ‌చ్చే ప్ర‌తి చిత్రం పై ప్రేక్ష‌కుల‌కి అంచ‌నాలు వుంటాయి. వారిని దృష్థిలో పెట్టుకుని చిత్రాలు నిర్మిస్తున్నాం. కార్తికేయ గ‌త చిత్రాలకి ఈ చిత్రం పూర్తి భిన్నం గా వుండాలి అనుకున్నాం. మెము అనుకున్న దానికంటే కూడా కార్తికేయ పాత్ర‌ల ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశారు. ఈ విజువ‌ల్ చూస్తేనే మీకు అర్ధ‌మ‌వుతుంది. కార్తికేయ డేడికేష‌న్ మా అవుట్‌పుట్ అంత అందంగా వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు కౌశిక్ కొత్త‌వాడ‌యినా చాలా టాలెంట్ వున్న‌వాడు. చెప్పిన పాయింట్ చాలా కొత్త‌గా అనిపించింది. రెగ్యుల‌ర్ సినిమా కాదు అని మాత్రం ఖ‌చ్చితం గా చెప్ప‌గ‌ల‌ను. ఈ చిత్రానికి సంబందించి మ‌రిన్ని స‌ర్‌ప్రైజ్ లు త్వ‌ర‌లో వ‌స్తాయి. అని అన్నారు

తారాగ‌ణం

కార్తీకేయ‌, లావ‌ణ్య త్రిపాఠి, ఆమ‌ని త‌దితరులు

సాంకేతిక వ‌ర్గం

స‌మ‌ర్ప‌ణ - అల్లు అర‌వింద్
బ్యాన‌ర్ - జీఏ2 పిక్చ‌ర్స్
నిర్మాత - బ‌న్నీ వాసు
స‌హ‌నిర్మాత -- సునిల్ రెడ్డి
ఎడిట‌ర్‌-- స‌త్య జి
ఆర్ట్‌-- జి ఎమ్ శేఖ‌ర్‌
సినిమాటోగ్రాఫ‌ర్ - సునీల్ రెడ్డి
అడిషిన‌ల్ డైలాగ్స్ .. శివ కుమార్ భూజుల‌
ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్‌.. మ‌నిషా ఏ ద‌త్‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌.. మౌనా గుమ్మ‌డి
పి ఆర్ ఒ.. ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్స్‌.. శ‌ర‌త్ చంద్ర నాయిడు, రాఘ‌వ క‌రుటూరి
మ్యూజిక్ - జకీస్ బిజాయ్
ద‌ర్శకుడు - కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి


 

 

 

    
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved