pizza
Most awaited combo -Nitin - Chandrasekhar Yeleti - Bhavya Creations 'CHECK' Movie First Glimpse is out !!
నితిన్ - చంద్రశేఖర్ యేలేటి - భవ్య క్రియేషన్స్ కాంబినేషన్లో రూపొందుతోన్న 'చెక్' సినిమాఫస్ట్ గ్లింప్స్ రిలీజ్!!
You are at idlebrain.com > news today >
 
Follow Us

3 January -2021
Hyderabad


 

Hero Nitin is joined by Rakul Preet Singh and Priya Prakash Warrior as the female leads, directedby Chandrasekhar Yeleti produced by V.Anand Prasad.The first glimpse of the film is released on Sunday, which is 40 seconds long, revealed some interesting dimensions of the film.

Producer V. Anand Prasad said, ‘’The combination of Nitin and Chandrasekhar will surely exceeds expectations of the fans. The shooting is wrapped up and currently re-recording is being done. After 'Aite', - This is the Chandrasekhar Yeleti - Kalyani Malik combination film. The output is excellent. Release details will be revealed soon. "

Director Chandrasekhar Yeleti said "This is the story of a prisoner who was hanged....!!!"

 

The film stars Nitin, Rakul Preet Singh, Priya Prakash Warrior, Posani Krishna Murali, Murali Sharma, Tripuraneni Saichand, Sampath Raj, Harshavardhan, Rohit Pathak, Simran Chowdhury among others.

 

Music: Kalyani Malik,

Cinematography: Rahul Srivastava,

Art: Vivek Annamalai,

Editing: Anal Aniruddhan,

Executive Producer: Anne Ravi, Producer: V. Anand Prasad,

Story - Screenplay - Direction: Chandrasekhar Yeleti.

నితిన్ - చంద్రశేఖర్ యేలేటి - భవ్య క్రియేషన్స్ కాంబినేషన్లో రూపొందుతోన్న 'చెక్' సినిమా

ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్!!

 

నితిన్ - చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో భవ్య క్రియేషన్స్ పతాకం పై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం "చెక్". రకుల్

ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ఇందులోకథానాయికలు. ఈ చిత్రానికి సంబంధించిన తొలి గ్లిమ్స్ని ఆదివారం విడుదల చేశారు . "జైలు లో ఆదిత్య అనే ఖైదీ చెస్ అద్భుతంగా ఆడుతున్నాడు" అనే వాయిస్ ఓవర్ తో ఈ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ఆదిత్యను విశ్వనాధన్ ఆనంద్ , కాస్పరోవ్ తో ఒకరు పోలిస్తే, ‘అతను పచ్చి తీవ్రవాది, టెర్రరిస్ట్, దేశద్రోహి’ అని పోలీస్ ఆఫీసర్ దూషిస్తాడు. 'HE IS INNOCENT' అని లేడీ అడ్వకేట్ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. 40 సెకన్ల నిడివి కలిగిన ఈ గ్లింప్స్, సినిమాలోని ఆసక్తికరమైన కోణాలని ఆవిష్కరించింది.

 

ఈ సందర్బంగా నిర్మాత వి.ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ "నితిన్- చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ పై అభిమానులు పెట్టుకున్న అంచనాలకు ఏ మాత్రం తగ్గదు ఈ సినిమా. ఈచిత్రం షూటింగ్ మొత్తం పూర్తయ్యింది . ప్రస్తుతం రీ - రికార్డింగ్ జరుగుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ‘ఐతే ‘ చిత్రం తర్వాతచంద్రశేఖర్ యేలేటి - కళ్యాణి మాలిక్

కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా ఇదే. ఔట్ పుట్ అద్భుతంగా వచ్చింది. రిలీజ్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం" అని తెలిపారు.

దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ- ''చదరంగం నేపథ్యంలో సాగే ఓ ఉరిశిక్షపడ్డ ఖైదీ కథ ఇది '' అని చెప్పారు.

 

నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్షవర్ధన్, రోహిత్ పాథక్, సిమ్రాన్ చౌదరితదితరులు ఈ చిత్రం ప్రధాన తారాగణం.

 

ఈ చిత్రానికి సంగీతం : కళ్యాణి మాలిక్, ఛాయా గ్రహణం : రాహుల్ శ్రీవాత్సవ్ , ఆర్ట్ : వివేక్ అన్నామలై , ఎడిటింగ్ : అనల్ అనిరుద్దన్ , ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి , నిర్మాత : వి.ఆనంద ప్రసాద్,

కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : చంద్రశేఖర్ యేలేటి.

 

 

 

 

 

 

 

 

 





   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved