pizza
Chinna Cinema release on 19 April
You are at idlebrain.com > news today >
Follow Us

11 April 2013
Hyderabad

జెర్సీ ప్లాట్స్ బ్యానర్ పై అర్జున్ కళ్యాణ్, సుమోన చందా, కోమల్ ఝా, కేథరిన్, వెన్నెల కిశోర్, తాగుబోతు రమేష్, బాలయ్య, సూర్య ప్రధాన పాత్రధారులుగా నిర్మించబడిన చిన్న సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని శ్రీ రామనవమి కానుకగా ఏప్రిల్ 19న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ రావడం పట్ల చిత్ర బృందం సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చిత్ర దర్శకుడు ఎ.కె. కంభంపాటి మాట్లాడుతూ, “సినిమా అనుకున్నది అనుకున్నట్టుగా తీయగలిగాం. అన్ని వర్గాల వారిని అలరించే చిత్రం అవుతుందని మా నమ్మకం. వాల్ పోస్టర్స్, ట్రైలెర్ వలన మంచి ప్రచారంతో జరగడంతో పాటు మంచి బిజినెస్ కూడా జరిగింది. “ అని తన ఆనందం వ్యక్తం చేశారు. నిర్మాతలు జ్యోతి, శేఖర్ మాట్లాడుతూ, “అనుకున్న టైం కి విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాని కృష్ణా జిల్లాల్లో దుర్గా ఫిల్మ్స్ వారు పంపిణీ చేయగా ఆంధ్రప్రదేశ్ లోని మిగతా ప్రాంతాలలో శ్రీ లక్ష్మి పిక్చర్స్, ఓవర్ సీస్ లో రైన్ బో ఎంటర్టైన్మెంట్స్ పంపిణీ చేస్తున్నారు.” అని తెలియ చేశారు.

ముఖ్య తారాగణం: అర్జున్ కళ్యాణ్, సుమోన చందా, కోమల్ ఝా, కేథరిన్ వెన్నెల కిశోర్, తాగుబోతు రమేష్, బాలయ్య, ఎల్. బి. శ్రీరాం, సూర్య, మహేష్ శ్రీరాముల, రఘు, సిద్దాంత్, శ్రీనివాస్ కార్తిక్, శ్రీని కొల్ల, RJ గజిని, పృథ్వి గౌతమ్ రాజు, ప్రదీప్ శక్తి, గుండు సుదర్శన్.

సినిమాటోగ్రఫీ: హైదర్ బిలిగ్రామి (US shoot), పి.జి. విందా (India Shoot) ; సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, ఎడిటింగ్: వినయ్ రామ్; నిర్మాతలు: శేఖర్, జ్యోతి ; దర్శకుడు: ఎ.కె. కంభంపాటి


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2013 Idlebrain.com. All rights reserved