pizza

Mega Star Chiranjeevi tests positive for Corona
చిరంజీవికి క‌రోనా పాజిటివ్‌.. క్వారంటైన్‌లో మెగాస్టార్‌

You are at idlebrain.com > news today >
Follow Us

26 January 2022
Hyderabad

Megastar took to twitter today and announced that he has been tested positive for Corona. He has self-quarantined and requested everybody who has come in contact with him to take the test and isolate.

Chiranjeevi has announced about getting covid positive in the past once and it later turned out to be a false alarm.

We wish a speedy recovery for our mega star.

చిరంజీవికి క‌రోనా పాజిటివ్‌.. క్వారంటైన్‌లో మెగాస్టార్‌

కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. కరోనా కారణంగా చాలా పరిశ్రమలు ఇబ్బందులు ప‌డ్డాయి. అలా ఇబ్బందులు ప‌డ్డ వాటిలో సినీ ప‌రిశ్ర‌మ ముందు వ‌రుస‌లో ఉంది. ముఖ్యంగా కరోనా థర్డ్ వేవ్‌లో సినీ ప్ర‌ముఖులు చాలా మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కోరోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ‘‘ప్రియమైన అందరికీ.. కరోనా వైరస్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా ప్రభావంకు లోనయ్యాను. కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలున్నాయి. ఇంట్లోనే క్వారంటైన్ అయ్యాను. ఈ మ‌ధ్య కాలంలో న‌న్ను క‌లిసి వారంద‌రూ క‌రోనా టెస్టులు చేయించుకోండి. మిమ్మ‌ల్ని మిమ్మ‌ల్ని అంద‌రినీ క‌ల‌వ‌కుండా ఉండ‌లేక‌పోతున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి.

గతంలోనూ ఓసారి చిరంజీవికి క‌రోనా పాజిటివ్ అని వార్త‌లు వ‌చ్చాయి. అయితే అది త‌ప్పుడు క‌రోనా కిట్ కార‌ణంగా మారిన ఫ‌లిత‌మేన‌ని చిరంజీవి అప్ప‌ట్లో తెలిపారు. అయితే ఈసారి మాత్రం ఆయ‌న స్వ‌యంగా నిర్దారించారు. క‌రోనా స‌మయంలో సీసీసీ సంస్థ‌ను స్థాపించి సినీ కార్మికుల‌కు అండ‌గా నిలిచిన చిరంజీవి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని సినీ ప‌రిశ్ర‌మ‌, సామాన్యులు, అభిమానులు కోరుకుంటున్నారు.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved