pizza
Superstar Mahesh Babu Unveiled Megastar Chiranjeevi, Meher Ramesh, Anil Sunkara’s Film Title- Bholaa Shankar
మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేశ్, అనీల్ సుంకర చిత్రం `భోళా శంకర్`. టైటిల్ పోస్ట‌ర్‌ విడుద‌ల చేసిన సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు
You are at idlebrain.com > news today >
Follow Us

22 August 2021
Hyderabad

Megastar Chiranjeevi and stylish maker Meher Ramesh are collaborating for the first time for a film to be produced by Ramabrahmam Sunkara. The makers promised Mega Euphoria on the occasion of Chiranjeevi’s Birthday and they have arrived with the film’s title on the special day.

Superstar Mahesh Babu has unveiled title of the movie. A superstar launching megastar film’s title is a good evolution and a positive sign for the industry.

“Happy birthday @KChiruTweets garu🤗 Honoured to be unveiling the title of your film! #BholaaShankar, under the directorial skills of my good friend @MeherRamesh and my favourite producer @AnilSunkara1 garu. May the year ahead bring you great health and success. All the best sir!” tweeted Mahesh Babu.

The film is titled strikingly as Bholaa Shankar and it is an apt one, given Chiranjeevi is very kind-hearted genuine person who has a childlike innocence, without any conspiracies in mind in real life.

The word 'Mega' is shaped like a hill indicating how the Megastar is high like a hill in his good heart and his achievements.

It is known that, Lord Shiva is called as Bholaa Shankar for his generosity and kind nature. The title indeed labels protagonist’s soft-hearted and gentleness in the movie.

The title design is arresting with a trident as crown to it. Howrah Bridge and Kali Mata temple can be seen in the poster.

Mahati Swara Sagar’s background score for the motion poster is captivating.

Meher Ramesh is known for making stylish and commercial entertainers and Bholaa Shankar is going to be a stylish action thriller laced with family emotions.

Anil Sunkara’s AK Entertainments will be producing the film, in association with Creative Commercials.

Needless to say, Chiranjeevi and Meher Ramesh together are going to create Mega Euphoria with Bholaa Shankar.

The regular shooting of Bholaa Shankar commences soon, while it will release in theatres in 2022.

Team Bholaa Shankar thanks Mahesh Babu for launching the title poster.

Cast: Chiranjeevi

Technical Crew:
Director: Meher Ramesh
Producer: Ramabrahmam Sunkara
Banner: AK Entertainments

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేశ్, అనీల్ సుంకర చిత్రం `భోళా శంకర్`. టైటిల్ పోస్ట‌ర్‌ విడుద‌ల చేసిన సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు

మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేక‌ర్ మెహ‌ర్ ర‌మేశ్ కాంబినేష‌న్‌లో సినిమా రూపొంద‌నుంది. రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మెగా యుఫోరియాను అనౌన్స్ చేస్తామ‌ని మేక‌ర్స్ ప్రామిస్ చేశారు. చెప్పిన‌ట్లే ఈ స్పెష‌ల్ డే రోజున ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేయ‌డం విశేషం.

ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు విడుద‌ల చేశారు. ఇలా మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ విడుద‌ల చేయ‌డమ‌నేది మంచి ప‌రిణామమే కాదు.. ఇండ‌స్ట్రీకి సానుకూల సంకేతాన్ని ఇచ్చిన‌ట్ల‌య్యింది.

``హ్యాపీ బ‌ర్త్ డే చిరంజీవిగారు. నా స్నేహితుడు మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో, నా ఫేవ‌రేట్ ప్రొడ్యూస‌ర్ అనీల్ సుంక‌ర్ నిర్మాత‌గా రూపొందనున్న మీ `భోళా శంక‌ర్` సినిమా టైటిల్‌ను విడుద‌ల చేయ‌డమ‌నేది గౌర‌వంగా భావిస్తున్నాను. ఈ ఏడాది మీరు ఆయురారోగ్యాల‌తో విజ‌యాల‌ను సాధించాల‌ని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సర్‌`` అంటూ టైటిల్‌ను విడుద‌ల చేస్తూ మ‌హేశ్ బాబు ట్వీట్ కూడా చేశారు.

నిజ జీవితంలో అంద‌రినీ నిజాయ‌తీగా ఆద‌రిస్తున్న ద‌యార్ద్ర హృద‌య‌మున్న చిరంజీవిగారికి త‌గిన‌, అద్భుత‌మైన టైటిల్ అని అంటున్నారు. ఇందులో మెగా అనే టైటిల్‌ను గ‌మ‌నిస్తే అందులో కనిపిస్తున్న కొండ ఆయ‌న త‌న స‌హృద‌యంతో, ల‌క్ష్య సాధ‌న‌ల‌తో ప‌ర్వత‌మంత ఎత్తుకు ఎలా ఎదిగార‌నే దాన్ని సూచిస్తుంది.

అలాగే `భోళా శంక‌ర్` అనేది ప‌ర‌మేశ్వ‌రుడికి మ‌రో పేరు. ద‌యగ‌ల‌వాడ‌ని అంద‌రూ అలా సంబోధిస్తుంటారు. టైటిల్ ప్ర‌కారం చూస్తుంటే మ‌న క‌థానాయ‌కుడు మంచి హృద‌యమున్న‌వాడ‌ని అర్థం వ‌చ్చేలా, హీరో క్యారెక్ట‌ర్‌ను ఎలివేట్ చేసేలా టైటిల్‌ఉంది.

ఈ టైటిల్ పోస్ట‌ర్‌లో డిజైన్ చేయ‌బ‌డిన కిరీటం, త్రిశూలం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. అలాగే పోస్ట‌ర్‌లో హౌరా బ్రిడ్జ్‌, కాళీమాత గుడి క‌నిపిస్తుంది. ఈ మోష‌న్ పోస్ట‌ర్‌కు మ‌హ‌తి సాగ‌ర్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ను చాలా స్టైలిష్‌గా తెర‌కెక్కిస్తాడ‌నే పేరున్న డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేశ్.. ఈ `భోళా శంక‌ర్‌` సినిమాను ప్యామిలీ ఎమోష‌న్స్‌తో స్టైలిష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కించ‌బోతున్నార‌ని అర్థ‌మ‌వుతుంది.

చిరంజీవి, మెహ‌ర్ ర‌మేశ్ కాంబినేష‌న్‌లో ..అనీల్ సుంక‌ర త‌న ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ అసోషియేష‌న్‌తో నిర్మిస్తోన్న `భోళా శంక‌ర్‌` మూవీ.. మెగా యుఫోరియాను క్రియేట్ చేస్తుంద‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. 2022లో సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేశారు.

`భోళా శంక‌ర్` టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబుకు చిత్ర‌యూనిట్ ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేసింది.

న‌టీన‌టులు:
చిరంజీవి కీర్తి సురేశ్‌

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: మెహ‌ర్ ర‌మేశ్‌
నిర్మాత‌: రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌
బ్యాన‌ర్‌: ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్‌

 

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved