pizza
Chitram Bhalare Vichitram news
కార్తిక డ్రీమ్ క్రియోష‌న్స్ ప్రోడ‌క్ష‌న్ నెం-1 'చిత్రం భ‌ళారే విచిత్రం'
You are at idlebrain.com > news today >
Follow Us

07 August 2015
Hyderabad

కార్తిక డ్రీమ్ క్రియోష‌న్స్ ప్రోడ‌క్ష‌న్ నెం-1 'చిత్రం భ‌ళారే విచిత్రం'

'కాళిచ‌ర‌ణ్‌', 'ల‌వ‌ర్స్' వంటి చిత్రాల్లో న‌టించి మెప్పించి అంద‌రిని ఆక‌ట్టుకున్న చాందిని ప్ర‌ధాన పాత్ర‌లో, 'రోమాంటిక్ క్రైమ్ స్టోరి' లాంటి విజ‌య‌వంత‌మైన చిత్రంలో న‌టించిన మ‌నోజ్‌నంద‌న్‌, అనిల్ క‌ళ్యాణ్ లు , సౌమ్య లు ముఖ్య‌పాత్ర‌ల్లో, క‌థే హీరోగా ప్ర‌యోగం లాంటి ప్ర‌యోగాత్మక చిత్రాన్ని రూపోందించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంశ‌లు అందుకున్న భాను ప్ర‌కాష్ బ‌లుసు ద‌ర్శ‌కత్వంలో కార్తిక డ్రీమ్ క్రియోష‌న్స్ ప్రోడ‌క్ష‌న్ నెం-1 గా తెర‌కెక్కిస్తున్న చిత్రానికి 'చిత్రం భ‌ళారే విచిత్రం' అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ చిత్రం తో పి. ఉమా కాంత్ నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. శ్రీమ‌తి పి.శిల్పా వాణి స‌మ‌ర్పిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో వున్న ఈ చిత్రం ఆద్యంతం న‌వ్వులు కురిపించేలా తెర‌కెక్కిస్తున్నారు.

ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు భాను ప్ర‌కాష్ బ‌లుసు మాట్లాడుతూ..' ప్ర‌యోగం' చిత్రం తో తెలుగు సినిమా ప్ర‌ముఖుల ప్ర‌శంశ‌లు అందుకున్నాను. క్రిటిక్స్ కూడా న‌న్ను ద‌ర్శ‌కుని గా అభినందించారు. అయితే మ‌ళ్ళి రెండ‌వ చిత్రం ద‌ర్శ‌కత్వం చేయాలంటే మ‌రో వైవిధ్య‌మైన క‌థ‌ని సిధ్ధం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. అందుకే కొంచెం టైం తీసుకుని ఈ క‌థ‌ని సిద్దం చేశాను. ఉమాకాంత్ గారు ఎప్ప‌టినుండో సినిమా నిర్మాణం చేప‌ట్టాల‌ని అనుకుంటున్నారు. ఆయ‌న‌కి ఈ క‌థ చెప్ప‌గానే త‌ప్ప‌కుండా చేద్దామ‌ని కార్తిక డ్రీమ్ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ ప్రారంభించారు. చాలా విభిన్న క‌థాంశంతో తెర‌కెక్కిన ఈచిత్రలొ ఫెర్‌ఫార్మెన్స్ వున్న న‌టీన‌టులు కావాలి. కాళిచ‌ర‌ణ్‌, ల‌వ‌ర్స్‌, కిరాక్ లాంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి సుప‌రిచిత‌రాలైన ఛాందిని ప్ర‌ధాన పాత్ర చేసింది. అలాగే మ‌నోజ్‌నంద‌న్‌, అనిల్ క‌ళ్యాణ్‌, సౌమ్య లు ముఖ్య పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు. మాచిత్రానికి క‌థ నే హీరో. కామెడినే హీరోయిన్‌. ఫుల్‌లెంగ్త్ కామెడి థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించిన ఈ చిత్రానికి ర‌క‌ర‌కాల టైటిల్స్ అనుకున్నాం చివ‌ర‌కి 'చిత్రం భ‌ళారే విచిత్రం అనే టైటిల్ ని ఖ‌రారు చేశాము. కామెడి చిత్రానికి బ్రాండ్ గా నిలిచిన చిత్రం భ‌ళారే విచిత్రం అనే టైటిల్ ని పెట్ట‌టానికి ఎంతో సాహ‌సం కావాలి. అందుకే మా చిత్ర క‌థ ని మా యూనిట్ అంద‌రికి వినిపించి స‌మిష్టిగా ఈ నిర్ణ‌యం తీసుకున్నాము. ప్ర‌స్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో వుంది. అతి త్వ‌ర‌లో ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్నాము. మా చిత్రం టైటిల్ కి త‌గ్గ‌ట్టుగానే త‌ప్ప‌కుండా అంద‌రిని అల‌రిస్తుంది.. అని అన్నారు.

నిర్మాత పి.ఉమాకాంత్ మాట్లాడుతూ.. కార్తిక డ్రీమ్ క్రియోష‌న్స్ ప్రోడ‌క్ష‌న్ నెం-1 గా మా బ్యాన‌ర్ లో భాను ప్ర‌కాష్ బ‌లుసు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న చిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో వుంది. ఛాందిని, మ‌నోజ్‌నంద‌న్‌, అనిల్ , సౌమ్య లు ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. పూర్తిగా కామెడి థ్రిల్ల‌ర్ గా నిర్మిస్తున్నాం. క‌థ‌, క‌థ‌నాలు చాలా ఢిఫ‌రెంట్ గా వున్నాయి. ఈ చిత్రం లోని వుండే బ్యాక్‌డ్రాప్ లో క‌థాంశం అంద‌రిని కంట‌త‌డి పెట్టిస్తుంది. ప్ర‌తిఫ్రేమ్ లో నవ్వుతూనే చివ‌ర‌లో చిన్న స‌స్పెన్స్ థ్రిల్లింగ్ తో ప్రేక్ష‌కులు దియోట‌ర్ నుండి బ‌య‌ట‌కి వ‌స్తారు. ద‌ర్శ‌కుడు భాను చాలా ఇంటిలిజెంట్ అండ్ సైలెంట్, త‌ను అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగా స్క్రీన్ ప్రెజెన్స్ రాబ‌ట్ట‌టంలో దిట్ట‌. న‌టీన‌టుల అంద‌రితో మంచి న‌ట‌న‌ని రాబ‌ట్టాడు. నా ఆల్‌టైం ఫేవ‌రేట్ ఫిల్మ్ చిత్రం భ‌ళారే విచిత్రం' అయితే ఇప్పుడు క‌థానుశారం మా చిత్రానికి కూడా అదే టైటిల్ యాప్ట్ అవ‌టం చాలా ఆనందంగా వుంది. ఎవ‌ర్‌గ్రీన్ టైటిల్ పెట్టినందుకు మా యూనిట్ అంతా గర్వ‌ప‌డుతున్నాం. ఈ టైటిల్ కి ఏమాత్రం తీసిపోకుండా మా చిత్రం వుంటుంది. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో వుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సెప్టెంబ‌ర్ లో విడుదల చేయ‌టానికి సన్నాహ‌లు చేస్తున్నాము. అని అన్నారు

హీరోయిన్ ఛాందిని మాట్లాడుతూ.. చాలా మంచి పాత్ర‌లో న‌టిస్తున్నాను. సినిమాలో న‌న్ను చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతారు. షూటింగ్ చేస్తున్నంత సేపు నేను సీరియ‌స్ గా వుండాలి. కాని సీన్ లో కామెడి న‌న్ను న‌వ్వించేలా చేసింది. డైర‌క్ట‌ర్ చాలా బాగా డిజైన్ చేశారు. నా కో ఆర్టిస్టులు చాలా బాగా కో-ఆప‌రేట్ చేశారు. ఈ చిత్రంలో నాకు ఛాన్స్ ఇచ్చిన ప్ర‌తి ఓక్క‌రికి నా ధ‌న్య‌వాధాలు అని అన్నారు

హీరో మ‌నోజ్ నంద‌న్ మాట్లాడుతూ.. నేను ఇప్ప‌టి వ‌ర‌కూ చేయ్య‌ని ఓ వైవిద్య‌మైన పాత్ర‌లో న‌టించాను. ఇప్ప‌టి వ‌ర‌కూ మా చిత్రం ఓ ఎత్తైతే ఇప్ప‌డు టైటిల్ ఓ ఎత్తు.. అంత గొప్ప టైటిల్ ప‌ట్ట‌టానికి చాలా ధైర్యం కావాలి. 'చిత్రం భ‌ళారే విచిత్రం' తెలుగు ఆడియ‌న్స్ కి ఆల్‌టైమ్ ఫేవ‌రేట్ చిత్రం. మా చిత్రం కూడా ఏమాత్రం తీసిపోకుండా ఆ టైటిల్ రేంజి ని పెంచే విధంగా వుంటుంది. అని అన్నారు.

న‌టీన‌టులు.. ఛాందిని త‌మిల‌ర‌స‌న్‌, మ‌నోజ్ నంద‌న్‌, అనిల్ క‌ళ్యాణ్‌, సౌమ్య‌, ప్ర‌భాస్ శ్రీను, జీవ‌, సూర్య‌, అల్ల‌రి సుభాషిణి, వాసు ఇంటూరి, జ‌బ‌ర్ద‌స్త్ రాము, కేక భాష‌, త‌దిత‌రులు న‌టింంచారు..

సాంకేతికి నిపుణులు..ఎడిటింగ్‌-గోపి సిందం, కెమెరా-టి.సురేంద‌ర్ రెడ్డి. సంగీతం- క‌న‌కేష్ రాథోడ్‌, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- రాము వీర‌వ‌ల్లి, నిర్మాత‌- పి.ఉమా కాంత్‌, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం- భాను ప్ర‌కాష్ బ‌లుసు


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved