pizza
రియల్ స్టోరీతో తెరకెక్కించిన 'చిత్రమ్ కాదు నిజమ్ - ఏ ట్రూ ఫుటేజ్ ఫిల్మ్ ఏప్రిల్ 3న విడుద‌ల‌
You are at idlebrain.com > news today >
Follow Us

31 March 2015
Hyderabad

"6-2=5", a film released recently in Kannada, has been a sensational success. After watching the film, audiences were shocked and were confused if the story is real or fictional. It is the story of six friends, who go to trekking in a forest and go missing one by one.

There are no dramatic elements in the film and the audiences feel what is happening on the screen is all real. Now taking the same footage, Good Cinema Group and Sri Shailendra productions are jointly releasing the film in Telugu. The film is titled as "Chitram Kaadhu Nijam- A True Footage film".

Coming to what happened really....
In 2010, six friends went to a forest which is 90 kms away from Mangalore for trekking and didn't return.In 2012, the forest department found a camera they took with them. Watching the visuals, the forest department officials were shocked and were moved by the visuals. After hearing about it, some people from Kannada film industry watched the visuals after contacting the forest department. They were heartbroken after watching the visuals and with the permission of forest department, they edited the visuals in the form a film and released it. Now Good Cinema group, which earlier produced films like 'Ee Rojullo', 'Romance', 'Villa' etc are releasing the film in Telugu in association with Sri Shailendra Productions. It is going to be a rare record in Telugu.This film will be released on April 3rd.

Producers Good Friends ( G.Srinivasa Rao,SKN,Maruthi) said that they are very happy to be releasing a very rare movie in Telugu. He added that the film, which is releasing on April 3rd, will shock everyone.

ఇటీవ‌ల క‌న్న‌డంలో 6-2=5 పేరుతో విడుద‌ల‌య్యి సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ చిత్రం చూసిన ప్రేక్ష‌కులు ఇది చిత్ర‌మా లేక నిజ‌మా అనే సందిగ్దంలో ప‌డ్డారు. ఏమాత్రం డ్ర‌మ‌టిక్ ఎలిమెంట్స్ లేకుండా ఓ అడ‌విలో ట్ర‌క్కింగ్ కి వెల్లిన ఆరుగురు ఫ్రేండ్స్ చుట్టూ తిరిగే క‌థ‌గా తెర‌పై క‌నిపిస్తుంది. కాని సినిమా కి ఏమాత్రం త‌గ్గ‌కుండా రియ‌ల్ ఇన్సిడెంట్ మ‌న క‌ళ్ళ‌ముందు జ‌రుగుతున్న మ‌ధురానుభూతిని క‌లిగిస్తుంది. ఇప్పుడు ఏప్రిల్ 3న తెలుగు లో ఆదే ఫుటేజ్ ని తీసుకుని తెలుగు ప్రేక్ష‌కులకి గుడ్‌సినిమా గ్రూప్ మ‌రియు శ్రీ శైలేద్ర ప్రోడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లు సంయుక్తంగా అందిస్తున్నారు. అస‌లు ఈ స్టోరి చిత్ర‌మా నిజమా అనే దాన్ని బేస్ చేసుకుని చిత్రం కాదు నిజమ్ అనే టైటిల్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు నిర్మాత‌లు.

అస‌లు జ‌రిగిన విష‌యానికోస్తే..

2010లో ఆరుగురు ఫ్రెండ్స్ సరదాగా ట్రక్కింగ్ చేయడానికి మంగుళూరు కు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ అడవిలోకి వెళ్లి, కనిపించకుండా పోయారు. అప్పుడు వాళ్లు తీసుకెళ్లిన కెమెరా 2012లో దొరకగా అందులోని విజువల్స్ లో వాళ్లు ఏ విధంగా కనపడకుండా పోయారో తెలిసింది. ఆ విజివ‌ల్స్ చూసిన అట‌విశాఖ వారు ఆశ్య‌ర్యానికి గుర‌య్యారు. ఓ విధంగా వారి మ‌న‌సు క‌లిచివేసింది. ఆ విష‌యం ఆనోటా ఈనోటా బ‌య‌ట‌కి పొక్కి క‌న్న‌డ‌లోని కొంద‌రు ఈ విజ‌వ‌ల్స్ ని చూడాల‌నుకున్నారు. అనుకొవ‌ట‌మే త‌రువాయి అట‌విశాఖ వారిని సంప్ర‌దించి ఆ విజువ‌ల్స్ ని చూశారు. వారి హ్రుద‌యం బ‌రువెక్కింది. ఈ విజువ‌ల్స్ ని ఎలాగైనా సినిమా రూపం లో ప్రేక్ష‌కుల‌కి అందించాల‌నుకుని అట‌విశాఖ‌లో ఉన్న‌తాధికారుల అనుమ‌తి తీసుకుని ఇప్పుడు ఆ విజువల్స్ ని సినిమా రూపంలో ఎడిటింగ్ చేసి, యథావిధిగా, అటవీశాఖ అనుమతితో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది వినడానికి వింతగా ఉన్నాచిత్రమ్ కాదు నిజ‌మ్‌...చిత్ర పరిశ్రమలోనే ఓ అరుదైన రికార్డుగా నిలుస్తుంది. ఇప్పుడు ఈ య‌ధార్ద‌సంఘ‌ట‌న‌ని ఈరోజుల్లో, రొమాన్స్, విల్లా, భద్రమ్ వంటి విజయవంతమైన వైవిధ్యమైన చిత్రాల్ని అందించిన గుడ్ సినిమా గ్రూప్, శ్రీ శైలేంధ్ర ప్రొడక్షన్స్ తో కలిసి సంయుక్తంగా తెలుగు ప్రేక్ష‌కుల‌కి అందిస్తున్నారు. రమేష్ ఈ ఫుటేజ్ ని షూట్ చేశారు.అన్ని కార్యక్ర‌మాలు పూర్తిచేసుకుంది, ఏప్రిల్ 3 న విడుద‌లవుతుంది.

ఈ చిత్ర విశేషాల గురించి నిర్మాత జి.శ్రీనివాస‌రావు మాట్లాడుతూ " ఓ అరుదైన సంఘటన ఆధారంగా రూపొందించి చిత్రం గా తీసుకొస్తున్నాం. మంగుళూరుకు సమీపంలోని ఫారెస్ట్ లో ఆరుగురు ఫ్రెండ్స్ కనిపించకుండా పోయిన సంఘటనల సమాహారమే 'చిత్రమ్ కాదు నిజమ్'. వాళ్లు కనిపించకుండా పోయినా...వారికి సంబంధించిన కెమెరా ఒకటి దొరికింది. అందులోని విజువల్సే చిత్రమ్ కాదు నిజమ్. అంటే ఏ ట్రూ ఫుటేజ్ ఫిల్మ్. అటవీశాఖ అనుమతి తీసుకొని ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. ఈరోజుల్లో, రొమాన్స్, భద్రమ్, విల్లా వంటి వైవిధ్యమైన చిత్రాల్ని అందించిన గుడ్ సినిమా గ్రూప్...' చిత్రమ్ కాదు నిజమ్' వంటి అద్భుతమైన సినిమా అందిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ తో కలిసి రిలీజ్ చేస్తున్నాం. ఏప్రిల్ 3న‌ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం" అని అన్నారు.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved