pizza
Chitrangada release on 3 March
మార్చి 3న చిత్రాంగద
You are at idlebrain.com > news today >
Follow Us

11 February 2017
Hyderabad

అందం, అభినయం కలగలిసిన తార అంజలి టైటిల్ పాత్రలో తెలుగు,తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం చిత్రాంగద. తమిళంలో యార్నీ పేరుతో నిర్మిస్తున్న ఈ హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ చిత్రానికి పిల్ల జమీందార్ ఫేం అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీధర్, రెహమాన్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్ర ఆడియోను వినూత్న పద్దతిలో ఒక్కొ పాటను ఒక్కొ లైవ్ షోల ద్వారా రిలీజ్ చేస్తున్నాం. మార్చి 3న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ జానర్‌లో రూపొందుతున్న చిత్రమిది. సినిమా ఆద్యంతం ఉత్కంఠగా, ఆసక్తికరంగా వుంటుంది. చిత్రంలో వుండే ట్విస్ట్‌లు ఆడియన్స్‌కు షాక్ గురిచేస్తాయి. కొన్ని అదృశ్య శక్తుల కారణంగా నాయిక జీవితం ఏ విధంగా చిక్కుల్లో పడింది? తనకు ఎదురైన సవాళ్లను అధిగించే క్రమంలో చిత్రాంగదకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నదే మా చిత్ర ఇతివృత్తం. ఈ హారర్, థ్రిల్లర్‌లో ప్రతి సన్నివేశం ఊహించని మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. కథానుగుణంగా ఆమెరికాలోని పలు అందమైన లొకేషన్స్ కీలక ఘట్టాల్ని చిత్రీకరించాంఅన్నారు.జెపీ, సప్తగిరి, రాజారవీంద్ర, సిందుతులానీ,రక్ష, దీపక్, సాక్షిగులాటి, జబర్ధస్త్ సుధీర్, జ్యోతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సెల్వగణేష్, స్వామినాథన్, ఎడిటర్: ప్రవీణ్‌పూడి, కెమెరా:బాల్‌రెడ్డి (హైదరాబాద్) మరియు, జేమ్స్ క్వాన్, రోహిన్ (యూఎస్‌ఎ), సమర్పణ: టీసీఎస్ రెడ్డి, వెంకట్ వాడపల్లి, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: అశోక్.జి, నిర్మాతలు: గంగపట్నం శ్రీధర్, రెహమాన్.

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved