pizza
Chaavu Kaburu Challaga teaser glimpse on 11
జనవరి 11న జీఏ 2 పిక్చ‌ర్స్ - కార్తికేయ‌‌ 'చావు క‌బురు చ‌ల్ల‌గా' టీజర్ గ్లిమ్స్
You are at idlebrain.com > news today >
 
Follow Us

9 January -2021
Hyderabad

KKGKGF: Chapter 1 was a huge hit, are you expecting KGF: Chapter 2 to break all records?

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారుపేరుగా నిలిచిన ‌బన్నీ వాసు నిర్మాత‌గా.. ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం 'చావు క‌బురు చ‌ల్ల‌గా'. ‌ ఇప్పటికే విడుదలైన టైటిల్.. హీరో కార్తికేయ 'బ‌స్తి బాల‌రాజు' ఫ‌స్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఆ త‌రువాత విడుద‌లైన క్యారెక్ట‌ర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి కూడా అనూహ్య స్పంద‌న ల‌భించింది. ముఖ్యంగా కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రి మాడ్యూలేష‌న్ చూస్తే మ‌ళ్లీ చూడాల‌నిపించేలా ఉందంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ గ్లింప్స్ జనవరి 11 ఉదయం 10 గంటల 56 నిమిషాలకు విడుదల కానుంది. ఈ మేరకు పోస్టర్ కూడా విడుదల చేశారు దర్శక నిర్మాతలు. కార్తికేయ ఫుల్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. మరోవైపు లావణ్య త్రిపాఠీ లుక్ చాలా నాచురల్ గా కనిపిస్తుంది. ఈ సినిమాకు.. జకీస్ బీజాయ్ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రం గురించి నిర్మాత బ‌న్నీ వాసు గారు మాట్లాడుతూ.. జిఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో భ‌లేభ‌లే మ‌గాడివోయ్‌, గీతాగోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే చిత్రాలు ఘ‌న‌ విజాయాలు సాధించాయి. అలాంటి బ్యాన‌ర్ లో వ‌చ్చే ప్ర‌తి చిత్రంపై ప్రేక్ష‌కుల‌కి అంచ‌నాలు వుంటాయి. వారిని దృష్థిలో పెట్టుకుని చిత్రాలు నిర్మిస్తున్నాం. కార్తికేయ గ‌త చిత్రాలకి ఈ చిత్రం పూర్తి భిన్నంగా వుండాలి అనుకున్నాం. అందుకే బస్తిబాల‌రాజు గా టీజ‌ర్ లో చూపించాం. అలానే ఆ తర్వాత లావ‌ణ్య త్రిపాఠిని మ‌ల్లిక గా ప‌రిచ‌యం చేసాం. ఇప్పుడు జనవరి 11న టీజర్ గ్లిమ్స్ విడుదల చేయబోతున్నాం. అలానే ఈ చిత్రాన్ని వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.

నటీనటులు..

కార్తీకేయ‌, లావ‌ణ్య త్రిపాఠి, ఆమ‌ని,ముర‌ళి శ‌ర్మ‌, ర‌జిత‌, భ‌ద్రం, మ‌హేష్‌, ప్ర‌భు త‌దితరులు

సాంకేతిక వ‌ర్గం..

స‌మ‌ర్ప‌ణ - అల్లు అర‌వింద్
బ్యాన‌ర్ - జీఏ2 పిక్చ‌ర్స్
నిర్మాత - బ‌న్నీ వాసు
దర్శకుడు - కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి
ఎడిట‌ర్‌- స‌త్య జి
ఆర్ట్‌ - జి ఎమ్ శేఖ‌ర్‌
మ్యూజిక్ - జేక్స్‌ బిజాయ్
సినిమాటోగ్రాఫ‌ర్ - క‌ర‌మ్ ఛావ్లా
అడిషిన‌ల్ డైలాగ్స్ - శివ కుమార్ భూజుల‌
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్స్ - రాఘ‌వ క‌రుటూరి, శ‌ర‌త్ చంద్ర నాయిడు
పి ఆర్ ఓ- ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్
ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్ - మ‌నిషా ఏ ద‌త్‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్ - మౌనా గుమ్మ‌డి

 

 




   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved