pizza
Dalapathi coming soon
`ద‌ళ‌ప‌తి` పాట‌లు విడుద‌ల‌
You are at idlebrain.com > news today >
Follow Us

24 September 2017
Hyderabad

రాజ్యానికి రాజెంత ముఖ్య‌మో, ఆ రాజును, ప్ర‌జ‌ల‌ను, చుట్టు ఉన్న వారికి కాపాడే దళ‌ప‌తి కూడా అంతే ముఖ్యం. సైన్యాన్ని ముందుండి న‌డిపే ద‌ళ‌ప‌తి రాజ్యానికి వెన్ను ద‌న్ను. మ‌రి మా `ద‌ళ‌ప‌తి` ఏం చేశాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాలంటున్నారు చిత్ర‌యూనిట్. ఆది అక్షర ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సదా దర్శకత్వంలో బాబురావు పెదపూడి నిర్మించిన చిత్రం `దళపతి`. సదా - కవితా అగర్వాల్ , బాబు - ప్రియాంక శర్మ రెండు జంటలుగా నటిస్తున్నారు

ఈ సందర్బంగా దర్శకులు సదా మాట్లాడుతూ " విభిన్న కథాంశం తో యాక్షన్ , ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న దళపతి చిత్ర షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యిందని , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. సినిమాలోని భావోద్వేగాలు ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది. జై అందించిన సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలవనుంది , జై అందించిన సహకారం వల్లే మా సినిమా అద్భుతంగా వచ్చిందని , జై అందించిన విజువల్స్ ప్రేక్షకులు థ్రిల్ ఫీలవ్వడం ఖాయమని ద‌ర్శ‌కుడు స‌దా అన్నారు .

నిర్మాత బాబురావు మాట్లాడుతూ ర‌జ‌నీకాంత్‌, మ‌మ్ముట్టి కాంబినేష‌న్‌లో పాతికేళ్ల క్రితం వ‌చ్చిన ద‌ళ‌ప‌తి ఎంత‌టి సెన్సేష‌న్‌ను క్రియేట్ చేసిందో మ‌న‌కు తెలిసిందే. అందులో ఎలాంటి ఎమోష‌న్స్ ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేశాయో, అలాంటి ఎమోష‌న్స్ ఈ సినిమాలో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తాయి. ద‌ర్శ‌కుడు స‌దా సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. యాజ‌మాన్యగారు అందించిన సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్ అయ్యింది. అల్రెడి విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తుంది. మా బ్యాన‌ర్‌లో వ‌స్తోన్న మొద‌టి చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని న‌మ్మ‌కంగా ఉన్నాం`` అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved