pizza
Dandupalyam 2's regular shoot from 14 February
ఫిబ్రవరి 14 నుంచి 'దండుపాళ్యం-2' రెగ్యులర్‌ షూటింగ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

10 January 2016
Hyderabad

ఫిబ్రవరి 14 నుంచి 'దండుపాళ్యం-2' రెగ్యులర్‌ షూటింగ్‌

వెంకట్‌ మూవీస్‌ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత వెంకట్‌ నిర్మించిన 'దండుపాళ్య' కన్నడలో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీగా 25 కోట్లు కలెక్ట్‌ చేసిన సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తెలుగులో 'దండుపాళ్యం' పేరుతో విడుదలై 10 కోట్లు కలెక్ట్‌ చేసి శతదినోత్సవం జరుపుకుంది. ఇప్పుడు నిర్మాత వెంకట్‌ 'దండుపాళ్యం' టీమ్‌తోనే ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'దండుపాళ్యం-2'ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ ఫిబ్రవరి 14న ప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా నిర్మాత వెంకట్‌ మాట్లాడుతూ - ''తెలుగు, కన్నడ భాషల్లో 'దండుపాళ్యం' చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మా బేనర్‌లో 'దండుపాళ్యం' టీమ్‌తోనే ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'దండుపాళ్యం-2'ని నిర్మిస్తున్నాం. రెగ్యులర్‌గా వచ్చే సినిమాలకు డిఫరెంట్‌గా వుంటూ రియలిస్టిక్‌గా వుండే సినిమా ఇది. మా 'దండుపాళ్యం' చిత్రానికి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులు 'దండుపాళ్యం-2'ని కూడా సూపర్‌హిట్‌ చేస్తారన్న నమ్మకం నాకు వుంది. ఫిబ్రవరి 14 నుంచి ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తున్నాం. మా బేనర్‌లో 'దండుపాళ్యం-2' మరో సెన్సేషనల్‌ మూవీ అవుతుంది'' అన్నారు.

దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ - ''దండుపాళ్యం-2' కథ రియలిస్టిక్‌గా వేలో చాలా పవర్‌ఫుల్‌గా వుంటుంది. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ప్రతి సీన్‌ చాలా గ్రిప్పింగ్‌గా వుంటుంది. 'దండుపాళ్యం' తర్వాత ఉపేంద్ర హీరోగా 'శివమ్‌' చిత్రాన్ని రూపొందించాను. ఈ చిత్రం 'బ్రహ్మన్న' పేరుతో తెలుగులో విడుదల కాబోతోంది. అలాగే తెలుగులో సూపర్‌హిట్‌ అయిన 'గీతాంజలి' చిత్రాన్ని 'కథే చిత్రకథే నిర్దేశన పుట్టన' పేరుతో కన్నడలో రీమేక్‌ చేశాను. ఈ జనవరి 1న రిలీజ్‌ అయిన ఈ చిత్రం 2016 సంవత్సరపు మొదటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఫిబ్రవరి 14న స్టార్ట్‌ అవుతున్న 'దండుపాళ్యం-2' కూడా మరో సెన్సేషనల్‌ మూవీ అవుతుంది'' అన్నారు.

ప్రకాష్‌రాజ్‌, బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధి, మకరంద్‌ దేశ్‌పాండే, రవి కాలె, నవాజుద్దీన్‌ సిద్ధిఖ్‌తోపాటు ఇద్దరు ప్రముఖ తెలుగు హీరోయిన్లు ఈ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్‌ ప్రసాద్‌, సంగీతం: అర్జున్‌ జన్య, కో-డైరెక్టర్‌: రమేష్‌ చెంబేటి, నిర్మాణం: వెంకట్‌ మూవీస్‌, నిర్మాత: వెంకట్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాసరాజు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved