pizza
Darling Swamy about Babu Bangaram
You are at idlebrain.com > news today >
Follow Us

07 August 2016
Hyderaba
d

విక్ట‌రి వెంక‌టేష్ కెరీర్లో నువ్వు నాకు న‌చ్చావు, మ‌ల్లేశ్వ‌రి చిత్రాల త‌రువాత ఫుల్‌ప్లేడ్జ్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ 'బాబు బంగారం'... క‌థా ర‌చయిత 'డార్లింగ్' స్వామి

విక్ట‌రి వెంక‌టేష్‌, న‌య‌న‌తార కాంబినేష‌న్ లో సితార‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) స‌మ‌ర్ప‌ణ‌లో, మారుతి ద‌ర్శ‌కుడిగా సూర్య‌దేవ‌ర నాగ వంశి, పి.డి.వి.ప్ర‌సాద్ లు సంయుక్తంగా నిర్మించిన‌ చిత్రం 'బాబు బంగారం' అగ‌ష్టు 12న చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడ‌దల అవుతుంది. విక్ట‌రి వెంక‌టేష్ కెరీర్లో నువ్వు నాకు న‌చ్చావు, మ‌ల్లేశ్వ‌రి చిత్రాల త‌రువాత ఫుల్‌ప్లేడ్జ్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ 'బాబు బంగారం' అంటున్నారు ఈ చిత్రానికి మారుతి గారితో క‌ల‌సి క‌థ‌, మాట‌లు అందించిన డార్లింగ్ స్వామి .

ఈ సంద‌ర్బంమ్ గా డార్లింగ్ స్వామి మాట్లాడుతూ.." 'బాబు బంగారం' చిత్రానికి మారుతి గారితో పాటు క‌థ‌, మాట‌లు అందించే అవ‌కాశాన్ని ఇచ్చిన విక్ట‌రి వెంక‌టేష్ గారికి, మారుతి గారికి మా అభినంద‌న‌లు. ఈచిత్రం మారుతి గారి అన్ని చిత్రాల క‌న్నా ఫుల్ ప్లేడ్జ్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైనింగ్ గా వుంటుంది. కామెడి చాలా బాగా పండింది. ముఖ్యంగా బ్ర‌హ్మ‌నందం, పృథ్వి, పోసాని, వెన్నెల కిషోర్ కామెడి చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. నువ్వునాకున‌చ్చావు, మ‌ల్లేశ్వ‌రి చిత్రాల త‌రువాత వెంక‌టేష్ గారు ఫుల్ ప్లేడ్జ్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైనింగ్ మూవి చెయ్య‌లేదు. ఫ్యామిలి ఎంట‌ర్‌టైన్‌మెంట్ తో పాటు ఫ్యాన్స్ కి కావ‌ల‌సిన ఫైట్స్, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ అన్ని పుష్క‌లంగా వున్నాయి. మారుతి గారు వెంక‌టేష్ గారిని ప‌ది సంవ‌త్స‌రాలు త‌గ్గించి చాలా స్టైలిష్ గా, ఎన‌ర్జిగా చూపించారు. ఈ చిత్రంలో జాలి క‌లిగిన ఓ పోలిస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో వెంక‌టేష్ గారు న‌టించి, న‌వ్వించారు. క‌థ విష‌యానికోస్తే భ‌యంక‌ర‌మైన ట్విస్ట్ లు, హ్రుద‌యాన్ని ద్ర‌వింప‌జేసే సెంటిమెంట్ వుండ‌దు. న‌వ్వించ‌ట‌మే , స‌ర‌దాగా యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైనింగ్ గా సాగుతుంది. జాలి క‌లిగిన ఓ పోలిస్ ఆఫీస‌ర్ స‌మ‌స్య‌లో వున్న ఓ అమ్మాయి జీవితంలోని వ‌స్తే ఎలా వుంటుందో 2 గంట‌లు న‌వ్విస్తూనే చెప్పారు. మాట‌ల విష‌యానికోస్తే సంబందంలేని ప్రాస‌లు వుండ‌వు, ట్రెండి గా వుండే లా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు మారుతి గారు. ఇప్ప‌టికే పాట‌లు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నాయి. ఈ చిత్రంతో మారుతి గారు క‌మ‌ర్షియ‌ల్ ద‌ర్శ‌కుడిగా టాప్ ప్లేస్ లో వుంటారు. ఈ చిత్రం అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది." అని అన్నారు

ఈ చిత్రంలో విక్ట‌రి వెంక‌టేష్‌, న‌య‌న‌తార‌, షావుకారు జాన‌కి, బ్ర‌హ్మ‌నందం, పోసాని కృష్ణ ముర‌ళి, పృద్వి, జ‌య‌ప్ర‌కాష్‌, ర‌ఘుబాబు, బ్ర‌హ్మ‌జి, సంప‌త్‌, ముర‌ళి శ‌ర్మ‌, వెన్నెల కిషోర్‌, మున్నా వేణు, గిరిధ‌ర్‌, అనంత్‌, రాజా ర‌వీంద్ర‌, ర‌జిత‌, గుండు సుద‌ర్శ‌న్ న‌టించ‌గా..

డాన్స్‌- బృంద‌, శేఖ‌ర్‌
స్టంట్స్‌- ర‌వి వ‌ర్మ‌
ఆర్ట్‌- ర‌మ‌ణ వంక‌
ఎడిట‌ర్‌- ఉద్ద‌వ్‌.ఎస్‌.బి
పి.ఆర్‌.ఓ- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరు శ్రీను
సంగీతం- జిబ్రాన్‌
క‌థ‌,మాట‌లు- మారుతి, డార్లింగ్ స్వామి
నిర్మాత‌లు- సూర్య‌దేవ‌ర నాగ వంశి, పి.డి.వి.ప్ర‌సాద్‌
క‌థ‌నం,ద‌ర్శ‌క‌త్వమ్ - మారుతి.


 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved