pizza
Dasari Narayana Rao appreciates Oopiri film
‘ఊపిరి’ వంటి డిఫరెంట్ సినిమా చేయడం నాగార్జున సాహసానికి, పివిపి గట్స్ కు నిదర్శనం - దర్శక రత్న డా.దాసరి నారాయణరావు
You are at idlebrain.com > news today >
Follow Us

28 March 2016
Hyderaba
d

తెలుగు, తమిళ భాషల్లో ఈ మార్చి 25న విడుదలైన ‘ఊపిరి’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. రీసెంట్ గా సినిమాను చూసిన దర్శకరత్న డా.దాసరి నారాయణరావు ‘ఊపిరి’ సినిమా గురించి మాట్లాడుతూ ‘’ఊపిరి సినిమా చూశాను. చాలా బావుంది. నా మనుసుకు ఎంతో నచ్చింది. తెలుగు సినిమా కొత్త తరహా సినిమాలు తీస్తున్నామని చెప్పడానికి ఊపిరి పోసింది. బొమ్మరిల్లు తర్వాత నాకు సంపూర్ణంగా నచ్చిన సినిమా లేదు. ఈ పదేళ్లలో ఇంత మంచి మేకింగ్, పెర్ ఫార్మెన్స్, ఒక డిఫరెంట్ సినిమా అనడానికి రియల్ అర్థం ఊపిరి. నాతో ఎవరూ ఏకీభవించినా, ఏకీభవించకపోయినా తెలుగులో ఇటువంటి సినిమా తీసే ప్రయత్నం ఎవరూ చేయలేదు. పరిగెత్తి పాటలు పాడి డ్యాన్సులు, ఫైట్స్ చేసే ఓ హీరోను రెండు గంటల పాటు కుర్చీలో కూర్చోపెట్టి సినిమా తీయడమనేది గొప్ప విషయం. నటుడికి నటించడానికి ఫేస్ కావాలి. కళ్లతో సినిమాలో నటించవచ్చు అని చెప్పడానికి నిదర్శనమే ఈ చిత్రం. అలాగే కార్తీ గత చిత్రాలను గమనిస్తే తను యాక్షన్ పంథాలో ఉన్నాయి. అయితే ఊపిరి చిత్రంలో తన నటన చూస్తే ఎంత బాగా చేశాడోననిపించింది. దానికి కారణం డైరెక్టర్ వంశీపైడిపల్లి. ప్రతి ఫ్రేమ్ లో డైరెక్టర్ కనపడ్డాడు. ప్రతి క్యారెక్టర్ ను అద్భుతంగా మౌల్డ్ చేశాడు. చక్కటి ట్రీట్ మెంట్, ఎక్కడా మెలో డ్రామా లేదు, కథలో క్యారెక్టర్ పరంగా ఉన్న కామెడి తప్ప మరేమీ లేదు. అలాగే ఈ సినిమాలో డిఫరెంట్ తమన్నాను చూస్తాం. చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన అనుష్క, శ్రేయలు కూడా అద్భుతంగా నటించారు. ఇది టోటల్ గా డైరెక్టర్స్ ఫిలిం. ఇలాంటి సబ్జెక్ట్ ఒప్పుకోవడం, చేయడం నాగార్జున సాహసం. ఎక్సలెంట్ ఫెర్ ఫార్మెన్స్ చేశాడు. వీటన్నింటికీ ముఖ్య కారణం గట్స్ ఆఫ్ పివిపి. నాకు తెలిసి పివిపి తప్ప వేరెవరు చేయలేరు. సాహసం చేయలేరు. ఈ సందర్భంగా పివిపి గారికి, యూనిట్ మొత్తానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను’’ అన్నారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved