pizza
Dasari Narayana Rao lauds Aadhi's "Malupu"
అది నటించిన "మలుపు"పై దాసరి ప్రశంసల ఝల్లు
You are at idlebrain.com > news today >
Follow Us

01 March 2016
Hyderaba
d

Actor Aadhi starrer "Malupu" emerged as a winner at the box office with rise in collections and theatres across the Andhra Pradesh and Telangana states. The film is being appreciated by all quarters and also impressed the critics. Now, the team added a new feather to their success cap. The Telugu titan and legendary director Dasari Narayana Rao called upon the team of "Malupu" and appreciated their work. Not just that, the filmmaker also hosted a special show all by himself for the entire team and discussed the making of the "Malupu", which will be out soon.

The super hit team of "Malupu" was humbled by his gesture and with all the appreciation received. The makers are also happy to announce that the satellite rights of the movie have almost been locked by a leading channel. The talks are also underway by a leading team of Bollywood for the rights of Hindi remake of the much-appreciated film.

Debutante Sathya Prabhas directed "Malupu" stars actress Nikki Galrani in a romantic lead role opposite Aadhi. Produced by Ravi Raja Pinisetty, the movie was inspired by a true incident in the lives of four friends. The thriller impressed the audience and is riding high at the ticket windows with positive reviews and word-of-mouth.

హైదరాబాద్: జంట తెలుగురాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణాల్లో వసూళ్ళతో పాటు థియేటర్ల సంఖ్యను కూడా పెంచుకుని ఆది నటించిన "మలుపు" చిత్రం బాక్సఫీస్‌ విజేతగా నిలిచింది. అన్ని వర్గాలనుండే కాకుండా ఈ చిత్రం విమర్శకుల నుండిసైతం ప్రశంసలనందుకుంటోంది. వీరి విజయహారంలోకి ఇప్పుడూ తాజాగా మరో కలికితురాయి చేరింది. టాలీవుడ్‌ సీనియర్‌ దర్శకుడు, అగ్రదర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు "మలుపు" చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా దర్శకరత్న దాసరి మొట్టమొదటిసారిగా తనకు తానుగా చిత్రబృందం కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి, తానే వ్యాఖ్యతగా వ్యవహరించి "మలుపు" చిత్రనిర్మాణ విశేషాలను గురించి చర్చించారు. ఈ వీడియో త్వరలోనే మన ముందుకు రాబోతోంది.

అనూహ్యంగా లభించిన ఈ అపూర్వ గౌరవానికి, అభినందనలకు "మలుపు" చిత్రబృందం సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రసారహక్కులను ఓ ప్రముఖ టెలివిజన్‌ ఛానల్‌ వారు సొంతం చేసుకోవడానికి కూడా దాదాపుగా నిర్ధారణకు వచ్చినట్టు చిత్ర నిర్మాతలు తెలిపారు. అలాగే బాలీవుడ్‌ కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణసంస్థవారు "మలుపు" సినిమా హిందీ రీమేక్‌ చేయడానికి కూడా సంప్రదింపులు జరుపుతున్నారు.

హీరో ఆది సరసన నిక్కి గల్రానీ నటించిన "మలుపు" చిత్రానికి నూతన దర్శకుడు సత్య ప్రభాస్‌ తొలిసారిగా దర్శకత్వం వహించారు. మరియు అలనాటి అగ్రదర్శకుడు రవిరాజా పినిశెట్టి నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం నలుగురు స్నేహితుల జీవితాల్లో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా తయారవడం విశేషం. ప్రేక్షకులను ఆకట్టుకున్న "మలుపు" చిత్రం హౌస్ ఫుల్ గా నడుస్తూ విడుదలైన అన్నిచోట్లా మంచి రివ్యూలతో మరియు మంచి టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved