pizza

“MAJOR” team shows Theatrical Trailer to Defence Minister Rajnath Singh in Delhi

You are at idlebrain.com > news today >
Follow Us

06 May 2022
Hyderabad

 

MAJOR, One of the most awaited films of the year, is based on the life of Major Sandeep Unnikrishnan, the decorated NSG Commando who perished while saving dozens during the 26/11 attacks.

As the film is inching closer to the release, piquing interests of the audience across quarters, the makers had the honour of a special meeting with Defence Minister of India, Mr. Rajnath Singh.

Actor - Adivi Sesh and Director - Sashi Kiran Tikka met with the Defence minister on Sunday, 1st May, in Delhi wherein the team showed the trailer of the film and discussed the story of the National Hero. Adivi Sesh portrays the titular role of Major Sandeep in the film.

Mr. Rajnath Singh graciously unveiled the slogan of the film. The words ‘Jaan Doonga Desh Nahi’ in Tricoloured font set against a pure white canvas. These words are the fundamental philosophy by which Major Sandeep lived. The slogan highlights his spirit, the emotion by which he saw the world. For him, the country always came first.

During the course of interaction, the respected Defence Minister appreciated the team for their efforts. Rajnath Singh Ji congratulated the director Sashi Kiran Tikka and Adivi Sesh for presenting the story of a brave hero of India. The makers would soon be organising a special screening for the Defence Minister and his family.

Celebrating the spirit of Sandeep Unnikrishnan's life, ‘Major’ traces the varied phases of the beloved soldier’s life, sneak peeks of which were witnessed in the teaser that has been playing in cinemas with all the recent blockbuster movies.

Designed for the big screen experience and mounted on a large scale, the bilingual film was shot in both Hindi and Telugu, and will release in Malayalam as well. The film offers an insight into Sandeep Unnikrishnan's dedication, courage, sacrifices, love and spirit of life.

Produced by Sony Pictures International Productions in association with Mahesh Babu's GMB Entertainment and A+S Movies, Major is directed by Sashi Kiran Tikka, and stars Adivi Sesh, Sobhita Dhulipala, Saiee Manjrekar, Revathi, Prakash Raj, Anish Kuruvilla and Murali Sharma. MAJOR will be released in Hindi, Telugu and Malayalam on 3rd June, 2022.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కి 'మేజర్' థియేట్రికల్ ట్రైలర్‌ చూపించిన చిత్ర యూనిట్

ఈ ఏడాది ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో అడివి శేష్ 'మేజర్' సినిమా ముందు వరసులో వుంది. 26/11 హీరో ఎన్ఎస్జీ కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మేకర్స్, భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

హీరో అడివి శేష్, దర్శకుడు - శశి కిరణ్ తిక్కా ఆదివారం మే 1వ తేదీన ఢిల్లీలో రక్షణ మంత్రితో భేటి అయ్యారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను ప్రదర్శించి, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథ గురించి మాట్లాడారు. ఇదే సందర్భంలో రాజ్‌నాథ్ సింగ్ మేజర్ సినిమా నినాదాన్ని ఆవిష్కరించారు. తెల్లటి కాన్వాస్‌ పై 'జాన్ దూంగా దేశ్ నహీ' అనే ఫోటో ఫ్రేంని రివీల్ చేశారు. ఈ నినాదం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ధీరత్వానికి అద్దం పట్టింది.

ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడు కథను చూపించబోతున్న దర్శకుడు శశి కిరణ్ తిక్క, అడివి శేష్‌లను అభినందించారు. చిత్ర యూనిట్ రక్షణ మంత్రి, కుటుంబ సభ్యుల కోసం సినిమా ప్రత్యేక స్క్రీనింగ్‌ ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది.

పాన్ ఇండియా సినిమాగా వస్తున్న 'మేజర్'లో మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. ఇలా మేజర్ సందీప్ జీవితంలోని అపూర్వ సంఘటనలు, అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు గ్రిప్పింగా చూపించబోతున్నారు.

శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ప్రముఖ తారాగణంగా కనిపించబోతున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మిస్తుంది. చిత్రం జూన్ 3 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved