pizza
Sri Kishore's new film titled 'Devi Sri Prasad'
విలక్షణ చిత్రాల దర్శకుడు శ్రీ కిషోర్ కొత్త చిత్రం `దేవిశ్రీప్రసాద్`
You are at idlebrain.com > news today >
Follow Us

8 July 2016
Hyderaba
d

`స‌శేషం`,`భూ` చిత్రాల‌తో తెలుగు సినీ అభిమానులు, ప్రేక్ష‌కుల సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు శ్రీ కిషోర్ హ్యాట్రిక్ చిత్రం `దేవిశ్రీప్రసాద్‘ ను తెరకెక్కించడానికి సిద్‌ోమ‌య్యారు. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పాయింట్ తో, ప్రేక్షకులు ఊహించని ట్విస్టులతో కూడిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఈ సినిమాను స‌రికొత్త రీతిలో తెర‌కెక్కించేలా శ్రీ కిషోర్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఓ క‌మెడియ‌న్‌తో పాటు ఇద్ద‌రు ప్ర‌ముఖ హీరోలు, ఓ ప్ర‌ముఖ హీరోయిన్ న‌టిస్తుండ‌టం విశేషం. సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. `దేవిశ్రీప్రసాద్` అనే టైటిల్ ప్రేక్షకుల్లో ఓ ఆసక్తిని రేకెత్తిస్తుందనడంలో సందేహం లేదు. ఇలా టైటిల్ తో పాటు పోస్టర్ డిజైనింగ్ నుండి ప్ర‌తి విష‌యంలో ద‌ర్శ‌కుడు శ్రీ కిషోర్ కొత్త పంథాలో యోచిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన న‌టీన‌టులు, టెక్నిక‌ల్ టీం వివ‌రాల‌ను తెలియ‌జేస్తారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved