pizza
‘ధనలక్ష్మి’ పాటలు చెవినబడితే..!!
జూన్‌ 5న ‘ధనలక్ష్మి తలుపు తడితే..’ ఆడియో
You are at idlebrain.com > news today >
Follow Us

30 May 2015
Hyderabad

మాస్టర్‌ సుక్కురామ్‌ సమర్పణలో భీమవరం టాకీస్‌ పతాకంపై.. యువ ప్రతిభాశాలి సాయి అచ్యుత్‌ చిన్నారిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ‘ధనలక్ష్మి తలుపు తడితే’ పాటలు జూన్‌5న విడుదల కానున్నాయి. బోలే శావలి సంగీత సారధ్యంలో రూపుదిద్దుకొన్న ఈ చిత్రం పాటలు తాజ్‌ బంజారాలో అత్యంత భారీగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో రిలీజ్‌ కానున్నాయి. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు అతిరధమహారధులు, ప్రముఖులు ఈ వేడుకలో పాలుపంచుకోనున్నారు.

ఆడియో విడుదల సందర్భంగా సంగీత దర్శకుడు బోలే శావలి మాట్లాడుతూ.. ‘ఓ గాయకుడిగా ‘కిక్‌`2’ చిత్రంలో నేను పాడిన ‘కంఫర్ట్‌’ సాంగ్‌ ఇస్తున్న కిక్‌లో ఉండగనే.. నేను సంగీతం సమకూర్చిన ‘ధనలక్ష్మి తలుపు తడితే’ ఆడియో ఫంక్షన్‌ జూన్‌ 5న చాలా గ్రాండ్‌గా జరగనుండడం కలిగిస్తున్న ఆనందం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఈ చిత్రం కోసం నేను స్వరపరిచిన ‘కనకధార స్త్రోత్రం’ నాకు చాలా మంచి పేరు తెస్తుందనే నమ్మకముంది. ఈ సందర్భంగా ధనరాజ్‌, రామసత్యనారాయణ, అచ్యుత్‌ చిన్నారిలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను’ అన్నారు.

ధనరాజ్‌, మనోజ్‌నందం, రణధీర్‌, అనిల్‌ కళ్యాణ్‌, విజయ్‌సాయి, సింధుతులాని, శ్రీముఖి, నాగబాబు, తాగుబోతు రమేష్‌, రచ్చరవి, షేకింగ్‌ శేషు మరియు జబర్దస్త్‌ బ్యాచ్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: బోలే శావలి, ఎడిటర్‌: శివ వై.ప్రసాద్‌, కెమెరామెన్‌: జి.శివకుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ప్రసాద్‌రెడ్డి మల్లు (యుఎస్‌ఎ)`ప్రతాప్‌ భీమిరెడ్డి(యుఎస్‌ఎ), సమర్పణ: మాస్టర్‌ సుక్కురామ్‌, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ`స్క్రీన్‌ప్లే`సంభాషణలు`దర్శకత్వం: సాయి అచ్యుత్‌ చిన్నారి!!

 

 


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved