pizza
Dhanraj - Venu - Thagubothu Ramesh & Chandra movie details
‘ధనరాజ్‌-వేణు-తాగుబోతు రమేష్‌-చమ్మక్‌చంద్ర’ హీరోలుగా..
You are at idlebrain.com > news today >
Follow Us

26 October 2015
Hyderabad

‘ధనరాజ్‌-వేణు-తాగుబోతు రమేష్‌-చమ్మక్‌చంద్ర’ హీరోలుగా..

ఇటు వెండితెరపై వెలుగులు విరజిమ్ముతూనే.. అటు బుల్లితెరపై చెలరేగిపోతున్న "ధనరాజ్‌-వేణు-తాగుబోతు రమేష్‌ మరియు చమ్మక్‌చంద్ర" లతో ఓ హాస్య ప్రధాన చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు రాజశేఖర్‌రెడ్డి అనే ఓ యువ వ్యాపారవేత్త. ఓ ప్రముఖ రచయిత అందించిన కథతో రూపొందనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌కు వెళ్లనుంది. ధనరాజ్‌ మాట్లాడుతూ.. ‘నేను, వేణు, రమేష్‌, చంద్ర.. నలుగురం ఈ కథ వింటున్నంత సేపూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూనే ఉన్నాం. నిజ జీవితంలో మంచి స్నేహితులమైన మేం నలుగురం ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తుండడం చాలా సంతోషంగానూ, ఎగ్జయిటింగ్‌గానూ ఉంది. ఓ ప్రముఖ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలోనే వెల్లడించనున్నాం ’ అన్నారు!!


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved