pizza
Dhruv Sekhar about Lovers Club
ఈ సినిమాతో నాకు అది అర్థ‌మైంది- ధృవశేఖర్
You are at idlebrain.com > news today >
Follow Us

18 November 2017
Hyderabad

ప్రవీణ్ గాలిపల్లి సమర్పణలో భరత్ అవ్వారి నిర్మాతగా ధృవ శేఖర్ దర్శకత్వంలో అనిష్ చంద్ర, పావని ,ఆర్యన్. పూర్ణి జంటగా నటించిన చిత్రం ‘లవర్స్ క్లబ్’. ఈ చిత్రాన్ని ప్లాన్ ‘బి’ ఎంటర్ టైన్మెంట్స్ యరియు శ్రేయ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మించారు. న‌వంబ‌ర్ 17న మూవీ విడుద‌లైంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ధృవశేఖర్ సినిమా గురించి మాట్లాడుతూ - ‘‘దర్శకుడిగా ఇది నా రెండో చిత్రం. గతంలో ప్రేమ బ్యాక్‌డ్రాప్‌లో ‘లవ్ చేస్తే’ అనే సినిమాను తెరకెక్కించాను. ఆ సినిమాను చూసిన వారందరూ బావుంద‌ని అన్నారు. మంచి కథ కోసం కాస్త గ్యాప్ తీసుకుని ‘లవర్స్ క్లబ్’ సినిమాను తెరకెక్కించాను. సినిమాలో ప్రేమతో పాటు మంచి యాక్షన్, కవుర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాను.సినిమా అంత‌టినీ ఐ ఫోన్‌తో షూట్ చేశాం. అందుకు కార‌ణం. కొత్త‌గా చేయాల‌నే ఆలోచ‌న‌. అలాగే హాలీవుడ్‌లో ఐఫోన్‌తో చిత్రీక‌రించిన సినిమా ఒక‌టి ఉంది. అందులో రెండు క్యారెక్ట‌ర్స్ మాత్ర‌మే ఉంటాయి. దాంతో ఆ సినిమా విడుద‌ల‌య్యేట‌ప్పుడు సెన్సేష‌న‌ల్ టాపిక్ అయ్యింది. అయితే పూర్తిస్థాయి ఐఫోన్ సినిమాను ఎవ‌రూ చేయ‌లేదు. కొత్త‌గా ఉంటుంద‌ని, అంతా చెక్ చేసుకున్న త‌ర్వాతే ఐఫోన్‌తో సినిమా చేశాను. సాధార‌ణ కెమెరాతో చేస్తే ఇదే సినిమాకు ఐదు కోట్ల బ‌డ్జెట్ అవుతుంది. కానీ నేను ఐఫోన్‌తో చేసిన సినిమాకు కోటిన్న‌ర మాత్ర‌మే బ‌డ్జెట్ అయ్యింది. నేచుర‌ల్ ఫీల్ మిస్ కాకుండా సినిమా చేయ‌గ‌లిగాను. సినిమా విడుద‌ల‌కు థియేట‌ర్స్ పెద్ద‌గా దొర‌క‌లేదు. ...త‌క్కువ సంఖ్య థియేట‌ర్స్‌లో సినిమా విడుద‌లైంది. ఆదివారం నుండి సినిమాకి థియేట‌ర్స్ పెంచుతున్నారు. నా స్నేహితులే నిర్మాత‌లు కావ‌డంతో సినిమాను అనుకున్న ప్లానింగ్‌లో పూర్తి చేశాం. యూత్‌ను టార్గెట్‌గా చేసుకుని అన్ని ఎలిమెంట్స్‌తో తయారు చేసుకున్న కథ. ఇందులో హీరో ప్రేమికులను కలపడమే కాకుండా, వారికి వచ్చే కష్టాల నుండి కాపాడుతుంటాడు. అందుకోసం కార్పొరేట్ స్టైల్‌లో కంపెనీ కూడా పెడ‌తాడు. అందుక‌నే సినిమాకు లవర్స్ క్లబ్ అని పేరు పెట్టాం. నిజానికి ఢిల్లీలో ఐదు మంది యువ‌కులు ప్రేమికులు కోసం ల‌వ‌ర్స్ క్ల‌బ్‌ను పెట్టారు. హీరోగా చేసిన అనీస్‌, పూర్ణ‌, పావ‌నిలు చ‌క్క‌గా న‌టించార‌ని అంటున్నారు. అయితే రాంగ్ టైంలో సినిమా రిలీజైంద‌ని అంటున్నారు. టాలీవుడ్‌లో హీరో రేంజ్ వేరుగా ఉంటుంది.ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్స్‌కు ర‌ప్పించేది హీరో మాత్ర‌మే. మన చుట్టూ జరుగుతున్న విషయాలను బేస్ చేసుకునే కథను రూపొందించాం. సాధారణంగా అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకున్నప్పుడు వారికి తల్లిదండ్రులు అడ్డు చెబుతారు. వారు పారిపోయి పెళ్లి చేసుకున్నప్పుడు కుటుంబం నుండి వ్యతిరేకత ఎదురవుతుంది. కొంతమంది అయితే వారి బిడ్డలను చంపేస్తున్నారు కూడా. ఇలాంటి పరువు హత్యలను చూసిన తర్వాత నా మదిలో వచ్చిన ఆలోచనే ఈ కథ. ప్రేమికులకు అండగా నిలబడే హీరో లవర్స్ క్లబ్‌ను స్టార్ట్ చేస్తాడు. అలాంటి లవర్స్ క్లబ్‌కి ఓ సమస్య వస్తే, హీరో ఆ సవుస్యను ఎలా అధిగమించాడు. ఏం చేశాడనేదే కథ. ఇప్పటి వరకు చాలా వరకు ప్రేవుకథలను ప్రేక్షకులు చూసుంటారు. హీరో అనేవాడు ప్రేమికులను కలపడం అనేది ఓ చిన్న భాగంగా చూపించి ఉంటారు. కానీ ఈ చిత్రంలో అదే ప్రధాన‌మైన పాయింట్‌.ప్రేమించడం అంటే ప్రేమలో ఉండటం..పెళ్లి చేసుకోవడం అంటే ఒక మనిషికే అంకితవువడం అనే విషయాలను ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నాను. వయోలెంట్ లవ్‌స్టోరీగా సినిమాను తెరకెక్కించాను. బలైమెన కంటెంట్ సినిమాకు ప్ర‌ధాన బ‌లం’’ అని చెప్పారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved