pizza
Dictator release for Sankranthi
You are at idlebrain.com > news today >
Follow Us

26 December 2015
Hyderaba
d

సంక్రాంతి సందర్భంగా ‘డిక్టేటర్’ విడుదల - శ్రీవాస్

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా నిర్మాణ రంగంలో అతిపెద్ద నిర్మాణ సంస్థగా పేరున్న ఈరోస్‌ ఇంటర్నేషనల్‌,వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా రూపొందిస్తోన్న బారీ బడ్జెట్‌ మూవీ ‘డిక్టేటర్‌’. అంజలి, సోనాల్‌ చౌహాన్‌, అక్ష హీరోయిన్స్‌.‘లౌక్యం’వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీ అందించిన శ్రీవాస్‌ ఈ చిత్రానికి దర్శకుడు. సినిమాను సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ..

కో ప్రొడ్యూసర్, దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ ‘’థమన్ సంగీతం అందించిన డిక్టేటర్ ఆడియో డిసెంబర్ 20న విడుదలైన సంగతి తెలసిందే. పాటలకు, థియేట్రికల్ ట్రైలర్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా పూర్తవుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా సినిమాను విడుదల చేస్తున్నాం. అభిమానులు, ప్రేక్షకులు బాలయ్యబాబు సినిమా ఎలా ఉండాలనుకుంటారో సినిమా అలా అందరినీ ఎంటర్ టైన్ చేసేలా ఉంటుంది’’ అన్నారు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved