pizza
Dilip Kumar about Maya Mall
`మాయామాల్` చూసే ఆడియెన్స్ ఎక్క‌డా బోర్ ఫీల్ కారు - హీరో దిలీప్‌
You are at idlebrain.com > news today >
Follow Us

5 July 2017
Hyderabad

దిలీప్‌, ఈషా, దీక్షాపంత్‌ ప్రధాన పాత్రథారులుగా రూపొందిన చిత్రం 'మాయామాల్‌'. గోవింద్‌ లాలం దర్శకుడు. కె.వి.హరికృష్ణ, చందు ముప్పాళ్ళ, నల్లం శ్రీనివాస్‌ నిర్మాతలు. సినిమా జూలై 14న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో దిలీప్‌ మీడియాతో సినిమా గురించిన విశేషాలను తెలియజేశారు.

దిలీప్‌ మాట్లాడుతూ - ''నా తొలి చిత్రం దర్శకుడు తేజగారి దర్శకత్వంలో 'హోరా హోరీ' సినిమా చేశాను. హీరోగా 'మాయా మాల్‌ నా రెండవ చిత్రం. దర్శకుడు గోవింద్‌ లాలం దిల్‌రాజుగారి చీఫ్‌ అసోసియేట్‌గా వర్క్‌ చేశారు. తను సోలో, 'ఓ మై ఫ్రెండ్‌', 'పిల్లా నువ్వులేని జీవితం' సినిమాలకు వర్క్‌ చేశారు. ఈ సినిమాలో నేను సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయ్‌ క్యారెక్టర్‌ చేశాను. వైజాగ్‌లో ఓ ఛేజింగ్‌ సీన్‌తో సినిమా స్టార్టవుతుంది. వైజాగ్‌ నుండి హైదరాబాద్‌ చేరుకున్న నేను, హీరోయిన్‌ కొన్ని కారణాలతో విలన్స్‌ దగ్గర నుండి తప్పించుకోవడానికి ఓ మాల్‌లో దాక్కొంటాం. అక్కడ నుండి అసలు కథ మొదలవుతుంది. మాలాగే కొన్ని క్యారెక్టర్స్‌ వేర్వేరు కారణాలతో ఆ మాల్‌లో ఉంటారు. ఈ అన్ని క్యారెక్టర్స్‌ మధ్య రాత్రి నుండి పొద్దున వరకు అంటే ఒక రాత్రిలో ఏం జరిగిందనేదే సినిమా. హారర్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా సినిమా ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తుంది.

Dilip Kumar interview gallery

సినిమాలో ఒక సాంగ్‌, రెండు ఫైట్స్‌ ఉంటాయి. ఇనార్బిట్‌, స్పెన్సర్‌, సినీ పొలిస్‌ మాల్స్‌లో చిత్రీకరణ జరిగింది. గోవింద్‌ దర్శకుడవుదామని ఈ కథను తయారు చేసుకుని ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఓసారి నన్ను కలిసి ఈ కథను చెప్పాడు. కథ వినగానే నేను థ్రిల్‌ ఫీలయ్యాను. ముందు ఈ కథకు బిగ్‌ బజార్‌ అనే టైటిల్‌ను అనుకున్నాం కానీ, తర్వాత ఏదైనా సమస్య వస్తుందని మాయామాల్‌ అనే టైటిల్‌ పెట్టాం. సినిమాలో దెయ్యం ఉంటుంది కానీ, ఓ గెటప్‌లో ఉంటుంది. నేను వేరే సినిమాలకు కమిట్‌ అయ్యాను. ఇదే బ్యానర్‌లో మరో సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అలాగే మరో రెండు సినిమాలకు సంబంధించిన డిస్కషన్స్‌లో ఉన్నాయి. 'మాయామాల్‌' అవుట్‌పుట్‌ అద్భుతంగా వచ్చింది. ఆడియెన్‌ చాలా అలర్ట్‌గా సినిమా చూస్తాడు. ఎక్కడా డిసప్పాయింట్‌ కారని కచ్చితంగా చెప్పగలను'' అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved