pizza
Stylish Star Allu Arjun & Harish Shankar's 'DJ ... Duvvada Jagannadham' first look on 18 Feb
ఫిబ్ర‌వ‌రి 18న స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ `డి.జె.దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌` ఫ‌స్ట్‌లుక్ రిలీజ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

12 February 2017
Hyderabad

First look of Stylish Star Allu Arjun & Harish Shankar's DJ (Duvvada Jagganadham) on February 18

After a hat-trick of successful films like Race Gurram, S/o Satyamurthy and Sarrainodu, Stylish Star Allu Arjun is busy shooting for his next with the director Harish Shankar – Duvvada Jagganadham. Produced under the Sri Venkateshwara Creatoins banner, by Dil Raju, the film is progressing at a brisk pace. The successful trio have teamed up for the film and the first look of which will be released on February 18, 2017.

Speaking about the same, producer Dil Raju shares, “In general, when a film is announced from our banner Sri Venkateshwara Creations, automatically there’s a huge curiousity among the audiences. And now that we have teamed up with Stylish Star Allu Arjun who worked with us in Arya and Parugu, and Harish Shankar who gave an industry hit like Gabbar Singh and earlier worked with us on Subramanyam For Sale, the interest is a lot more. Also, we have Devi Sri Prasad who scored tunes for films like Arya, Bunny, Arya 2, Julayi and S/o Satyamurthy and became a hit combination with Allu Arjun. And now the duo are set to recreate the magic. This is a prestigious project for us and we are leaving no stone unturned to ensure the film gets the best. Due to all these factors it is not just the audience and fans who have been waiting with bated breath but also industry insiders who are looking forward to see the end product. And the first look of this most awaited film is set to release on February 18. The teaser will be released for Maha Sivaratri. The film is presently being shot in Karnataka. For the next schedule in the end of February, the team will be going to Abu Dhabi. This film will surely go beyond everyone’s expectations.”

Cast: Allu Arjun, Pooja Hegde

Fights: Ram-Laxman

Cinematography: Ayananka Bose

Music: Devi Sri Prasad

Editor: Chota K Prasad

Art: Ravinder

Screenplay: Ramesh Reddy, Deepak Raj

Producer: Dil Raju

Story, dialogues, direction: Harish Shankar. S

ఫిబ్ర‌వ‌రి 18న స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ `డి.జె.దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌` ఫ‌స్ట్‌లుక్ రిలీజ్‌

`రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా, `గబ్బర్ సింగ్` వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న చిత్రం `డి.జె..దువ్వాడ జగన్నాథమ్`. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమా విశేషాల‌ను నిర్మాత దిల్‌రాజు తెలియ‌జేశారు.

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ``మా బ్యాన‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ నుండి సినిమా వ‌స్తుంద‌న‌గానే ప్రేక్ష‌కుల్లో సినిమాపై మంచి అంచ‌నాలుంటాయి. అలాంటిది ఆర్య‌, ప‌రుగు చిత్రాలు త‌ర్వాత అల్లుఅర్జున్ మా బ్యాన‌ర్‌లో చేస్తున్న సినిమా కావ‌డం ఒక‌టైతే, గ‌బ్బ‌ర్ సింగ్ వంటి ఇండ‌స్ట్రీ హిట్ సాధించిన హరీష్ శంక‌ర్ మా బ్యాన‌ర్‌లో సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాను డైరెక్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రం త‌ర్వాత మా బ్యాన‌ర్‌లో హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్ చేస్తున్న మూవీ కావ‌డం, `ఆర్య‌`, `బ‌న్ని`, `ఆర్య‌2`, `జులాయి`, `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` చిత్రాలు కమ‌ర్షియ‌ల్‌గా సూప‌ర్‌హిట్ కావ‌డ‌మే కాదు, మ్యూజికల్‌గా కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి అలాంటి హిట్ కాంబో బ‌న్ని, దేవి కాంబినేష‌న్ రిపీట్ అవుతుండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మేం కూడా చాలా ప్రెస్టీజియ‌స్‌గా ఈ చిత్రం రూపొందిస్తున్నాం. ఇటు ప్రేక్ష‌కులు, అభిమానులే కాదు, ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు సైతం సినిమా ఎలా ఉంటుందోన‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానులు, ప్రేక్ష‌కులు అతృత‌గా ఎదురుచూస్తున్న డి.జె.దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ ఫ‌స్ట్‌లుక్‌ను ఈ ఫిబ్ర‌వ‌రి 18న విడుద‌ల చేస్తున్నాం. అలాగే మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్నాం. ప్ర‌స్తుతం సినిమా క‌ర్ణాట‌క‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. నెక్ట్స్ షెడ్యూల్‌ను ఈ ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రున అబుదాబిలో షూట్ చేస్తున్నాం. అంద‌రి అంచ‌నాల‌ను మించేలా ఈ చిత్రాన్ని అన్ కాంప్ర‌మైజ్డ్‌గా తెర‌కెక్కిస్తున్నాం`` అన్నారు.

ఈ చిత్రానికి ఫైట్స్‌:రామ్‌-లక్ష్మణ్‌, సినిమాటోగ్రఫీ: ఐనాక బోస్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటర్‌: గౌతంరాజు, ఆర్ట్‌: రవీందర్‌, స్క్రీన్‌ప్లే: ర‌మేష్ రెడ్డి, దీపక్‌ రాజ్‌ నిర్మాత: దిల్‌రాజు, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్‌ శంకర్‌.ఎస్‌.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved