pizza
Duvvada Jagannadham trailer sets new record
డీజే.. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌తో స‌రికొత్త రికార్డుల్ని సృష్టిస్తోన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌
You are at idlebrain.com > news today >
Follow Us

6 June 2017
Hyderabad

There’s no stopping to Stylish Star Allu Arjun’s Duvvada Jagganadham. Just days after two of the songs from the film managed to strike a chord with the audiences and were received phenomenally, now the latest is that the trailer is breaking records! Within 24 hours of being released online, the trailer of the Harish Shankar-directorial has clocked a whopping 7.4 million views on YouTube and Facebook together. This is the highest for a film in south India after Baahubali: The Conclusion!

In fact, the makers of the film are very happy with the excellent feedback the trailer is receiving. Everyone who watched it has been raving about the two looks of Allu Arjun who has been shown in an avatar completely new for his fans and the audience in general. Another highlight everyone has been talking about the punch dialogues penned by Harish Shankar.

Buoyed by this positivity, the producers intend to announce the date of the grand audio launch soon. Set for a June 23 release, the film produced by Dil Raju & Shirish under Sri Venkateswara Creations, is a pakka entertainer starring Pooja Hegde as the female lead and Rao Ramesh as the prime antagonist. Devi Sri Prasad has scored the film’s tunes.

డీజే.. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌తో స‌రికొత్త రికార్డుల్ని సృష్టిస్తోన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, డైన‌మిక్ డైర‌క్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు నిర్మిస్తున్న సినిమా `డీజే.. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌`. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతోన్న 25వ సినిమా కావ‌డం విశేషం. ఈ చిత్రం ట్రైల‌ర్‌కు సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన స్పంద‌న వ‌స్తోంది. ట్రైల‌ర్ విడుద‌లైన 24గంట‌ల్లోనే యూట్యూబ్‌, ఫేస్‌బుక్ లో క‌లిపి 7.4 మిలియ‌న్ల మంది చూడ‌టం విశేషం.

యూత్ ఐకాన్‌గా త‌న స్టైల్స్ తో కుర్ర‌కారును ఆక‌ట్టుకునే అల్లు అర్జున్ ఈ చిత్రంలో బ్రాహ్మ‌ణ కుర్రాడిగానూ, స్టైలిష్ ఆఫీస‌ర్‌గానూ రెండు లుక్కుల్లో క‌నిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దానికి తోడు ట్రైల‌ర్‌లో హ‌రీశ్ శంక‌ర్ రాసిన పంచ్ డైలాగుల‌కు విప‌రీత‌మైన స్పంద వ‌స్తోంది. అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంట కూడా చూడ్డానికి క‌నువిందుగా ఉంది. దిల్‌రాజు బ్యాన‌ర్ నుంచి వ‌స్తోన్న చిత్రం కావ‌డంతో మేకింగ్ వేల్యూస్ కూడా అదే రేంజ్‌లో క‌నిపిస్తున్నాయి. ఇవ‌న్నీ క‌ల‌గ‌లిపి ఈ సినిమాకు అన్ని వ్యూస్‌ని తెచ్చిపెట్టాయి. ద‌క్షిణాదిన బాహుబ‌లి: ది కంక్లూజ‌న్ త‌ర్వాత ఇంత భారీ స్థాయిలో వ్యూస్‌ను తెచ్చుకున్న చిత్రం ఇదే కావ‌డం విశేషం.
ట్రైల‌ర్‌ను చూసిన ప్ర‌తి ఒక్క‌రూ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. పాజిటివ్ రివ్యూల‌ను అందిస్తున్నారు. అల్లు అర్జున్ రెండు గెట‌ప్పుల్లో చాలా వైవిధ్య‌త‌ను క‌న‌బ‌రిచార‌ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు. డైలాగ్ డెలివరీలోనూ అల్లు అర్జున్ గ‌త చిత్రాల‌కు ఈ సినిమాకూ తేడా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

జూన్ 23న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత దిల్‌రాజు స‌న్నాహాలు చేస్తున్నారు. అంత‌కు ముందే ఆడియో విడుద‌ల వేడుక‌ను భారీగా నిర్వ‌హించ‌డానికి కూడా ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నారు. త్వ‌ర‌లోనే పాట‌ల పండుగ తేదీని ప్ర‌క‌టిస్తారు. దేవిశ్రీ సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఈ చిత్రంలోని పాట‌ల‌కు ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లో చాలా మంది స్పంద‌న వ‌స్తోంది. ప్ర‌తినాయ‌కుడిగా రావు ర‌మేశ్ కు కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved