pizza
వచ్చే నెల మొదటి వారంలో 'డా. సలీమ్'
You are at idlebrain.com > news today >
Follow Us

20 February 2015
Hyderabad

విజయ్ ఆంటోని, అక్ష జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'డా. సలీమ్'. నాగప్రసాద్ సన్నితి సమర్పణలో ఎస్.కె. పిక్చర్స్ మరియు ఓబులేశ్వర ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంసెన్సార్ కార్యక్రమాలు ఈ వారంలో పూర్తి కానున్నాయి. మార్చి మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన సురేష్ కొండేటి మాట్లాడుతూ - "వైద్యం పేరుతో జనాలను దోచుకోవడం నేడు కొన్ని ఆస్పత్రులకు ఆనవాయితీ అయ్యింది. ప్రాణం పోసే డాక్టర్లు ఎక్కువ..ప్రాణం తీసే డాక్టర్లే ఎక్కువ అయిన ఈ రోజుల్లో డా. సలీమ్ మొదటి రకానికి చెందిన వ్యక్తి. ఓ అనాథ పిల్లను కాపాడి, వైద్యం చేసే సలీమ్ ఆ అమ్మాయి అసలు కథ తెలుసుకుంటాడు. అనాథఅమ్మాయికి అన్యాయం చేసిన బడా బాబుల అంతు చూడాలనుకుంటాడు సలీమ్. తను అనుకున్నది నెరవేర్చుకోవడానికి ఆ డాక్టర్ ఏం చేశాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రంసాగుతుంది. సంగీతదర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోని ఈ చిత్రంలో హీరోగా నటించారు. సలీమ్ పాత్రను అద్భుతంగా చేశారాయన. మా ఎస్.కె. పిక్చర్స్ నుంచిఇప్పటివరకు ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలే వచ్చాయి. ఈ చిత్రం కూడా ఆ కోవలో చేరే విధంగా ఉంటుంది. కమర్షియల్ అంశాలు మెండుగా ఉన్న మంచి కథతో దర్శకుడు నిర్మల్ కుమార్అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీయే పాటలు స్వరపరిచారు. మ్యూజికల్ గా కూడా సినిమా హిట్ అవుతుంది'' అని చెప్పారు.

మరో నిర్మాత తమటం కుమార్ రెడ్డి మాట్లాడుతూ - ''ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదు. అన్ని వర్గాలవారు చూడదగ్గ విధంగా చిత్రం ఉంటుంది. ఈ వేసవికి మంచి ఎంటర్ టైనర్అవుతుంది'' అన్నారు.
ఈ చిత్రానికి సహనిర్మాత: ఎం. అర్జున్ గౌడ్. దర్శకత్వం: ఎన్.వి. నిర్మల్ కుమార్. సంగీతం: విజయ్ ఆంటోని.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved