pizza
Dynamite preview at Prasads on 3 September night
-సెప్టెంబర్ 3న ‘డైనమైట్’ ప్రివ్యూ షో
You are at idlebrain.com > news today >
Follow Us

30 August 2015
Hyderabad

డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘డైనమైట్’. అరియానా వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమా రూపొందింది. ప్రణీత హీరోయిన్. దేవాకట్టా దర్శకుడు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్ లో రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 3న హైదరాబాద్ లోని ప్రసాద్ ఐ మ్యాక్స్ లో హీరో, నిర్మాత మంచు విష్ణు ప్రివ్యూ షోను ఏర్పాటు చేశారు. ఈ షో కి ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులను అందరినీ ఆహ్వానించారు. భారీ ఎత్తున సెలబ్రిటీస్ ఈ షో కి హాజరవుతారని సమాచారం. విజయన్ మాస్టర్ నేతృత్వంలో రూపొందిన యాక్షన్ పార్ట్ సినిమాకే హైలైట్ గా నిలస్తుందని చిత్రయూనిట్ ధీమాను వ్యక్తం చేస్తుంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved