pizza
Entha Manchivadavura "Jaataro Jaatara" song launch at RED FM
అమేజింగ్ రెస్పాన్స్ రాబ‌ట్టుకుంటోన్ననంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌ `ఎంత మంచివాడ‌వురా` మాస్ బీట్ సాంగ్ `జాత‌రో జాత‌ర‌...`
You are at idlebrain.com > news today >
Follow Us

27 December 2019
Hyderabad

నందమూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా 'శతమానం భవతి' చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న ద‌ర్శకత్వంలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ఎంత‌మంచివాడ‌వురా`. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ గోపీ సుంద‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ సినిమాలో రెండో సాంగ్ `జాత‌రో జాత‌ర‌..`ను శుక్ర‌వారం చిత్ర యూనిట్ రెడ్ ఎఫ్‌.ఎంలో విడుద‌ల చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్, సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ పాల్గొన్నారు.

``జాత‌రో జాత‌రో నేనొస్తే జాత‌రో ప‌రువాల మోత మోగ‌నీరో
పూత‌రో పూత‌రో బంగారు పూత‌రో నా మేని మెరుపు చూసుకోరో
ఊరోళ్ల కుర్రోళ్ల ఊర‌క చెప్పున‌మ్మో అస‌లైన పండ‌గేదో
నిప్పులోన ప‌డ్డాకే నిగ్గు తేలున‌మ్మో సిసలైన పుత్త‌డేదో....``

అంటూ నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, న‌టాషా దోషి మ‌ధ్య సాగే మాస్ బీట్ సాంగ్‌ను శుక్ర‌వారం రెడ్ ఎఫ్.ఎంలొ విడుద‌ల చేశారు. ఈ ప ఇప్ప‌టికే విడుద‌ల చేసిన `అవునో తెలియ‌దు కాదో తెలియ‌దు ..` అనే మెలోడీ సాంగ్‌కు, టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చాయి. ఇప్పుడు విడుద‌ల చేసిన మాస్ బీట్‌కు కూడా అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తోంది. శ్రీమ‌ణి సాహిత్యాన్ని అందించిన ఈ పాట‌ను బిగ్‌బాస్3 విన్న‌ర్, సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్‌, సాహితి చాగంటి ఆల‌పించారు.

ప్ర‌స్తుతం ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 15న విడుల చేస్తున్నారు.

న‌టీన‌టులు:
నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, మెహ‌రీన్‌, వి.కె.న‌రేశ్‌, సుహాసిని,శరత్‌బాబు,త‌నికెళ్ల భ‌ర‌ణి, ప‌విత్రా లోకేశ్‌, రాజీవ్ క‌న‌కాల‌, వెన్నెల కిశోర్‌, ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
రచన, ద‌ర్శ‌క‌త్వం: స‌తీశ్ వేగేశ్న‌
నిర్మాణం: ఆదిత్య మ్యూజిక్‌ (ఇండియా ) ప్రైవేట్‌ లిమిటెడ్‌
నిర్మాతలు ‌: ఉమేష్‌ గుప్తా, సుభాష్ గుప్తా
సమర్పణ :శివలెంక కృష్ణ ప్రసాద్,
సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌
సంగీతం: గోపీ సుంద‌ర్‌
ఎడిటింగ్‌:
త‌మ్మిరాజు
ఆర్ట్‌: రామాంజ‌నేయులు
ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: ర‌షీద్ ఖాన్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved