pizza
Vamsy’s ‘Fashion Designer s/o Ladies Tailor’ releasing on June 2
జూన్ 2 న విడుదలవుతున్న వంశీ ‘ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్’
You are at idlebrain.com > news today >
Follow Us

06 May 2017
Hyderabad

Creative director Vamsy’s latest film ‘Fashion Designer s/o Ladies Tailor’ is going to hit the screens on June 2. This film is produced by Madhura Sreedhar Reddy under Madhura Entertainment banner. As we all know, it’s a sequel to yesteryears sensational movie Ladies Tailor.

Sumanth Ashwin, Aneesha Ambrose, Manali Rathod, and Manasa Himavarsha are playing the main lead. Songs composed by ‘Melody Brahma’ Mani Sharma are already in the list of top ten chartbusters and received overwhelming response from the audience.

On this occasion producer Madhura Sreedhar Reddy said, “This film is going to be complete fun filled roller coaster for both Vamsy’s fans and present youth. It’s a musical comedy with triangle love story.”

“This film is going to bring laugh riots in the theatres and centres around Ladies Tailor son’s character, and what he’s doing now?” said director Vamsy.

Cast:
Sumanth Ashwin, Anisha Ambrose, Manali Rathod, Manasa Hima Varsha, Krishna Bhagavan, Raghavendra and others.

Technicians:
Music: Mani Sharma, Cinematography: Nagesh Banell, Editor: Baswa Pydi Reddy, Art: DY Satyanarayana, Dialogues: Kalyan Raghav, Lyrics: Sreemani, Chaitanya Prasad, Sree Valli.

జూన్ 2 న విడుదలవుతున్న వంశీ ‘ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్’

క్రియేటివ్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో, మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ‘ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్’ చిత్రం జూన్ రెండున విడుదల అవుతుంది. ముప్పై ఏళ్ళ క్రితం విడుదలై సంచలన విజయం సొంతం చేసుకున్న ‘లేడీస్ టైలర్’ చిత్రానికి ఇది సీక్వెల్.

సుమంత్ అశ్విన్, అనీషా ఆమ్రోస్, మనాలి రాథోడ్, మానస హిమవర్శ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి స్వర బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదల అయిన ఈ చిత్రం పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యి, ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన లభించాయి.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, “వంశీ గారి అభిమానులను, ఈ తరం యువతను అలరించే విధంగా ఉంటుంది. ఇది ఒక మ్యూజికల్ కామెడీ ట్రైయాంగిల్ లవ్ స్టొరీ” అన్నారు.

అప్పటి లేడీస్ టైలర్ రాజేంద్ర ప్రసాద్ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడు? అన్న కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఆద్యంతం కడుపుబ్బా నవ్వుకునే కామెడీతో తెరకెక్కించామని చిత్ర దర్శకుడు వంశీ తెలిపారు.

తారాగణం:
సుమంత్ అశ్విన్, అనీషా ఆమ్రోస్, మనాలి రాథోడ్, మానస హిమవర్శ, కృష్ణ భగవాన్, రాఘవేంద్ర... తదితరులు.

సినిమా సాంకేతిక వర్గం:
సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: నగేష్ బన్నెల్, ఎడిటర్: బస్వా పైడి రెడ్డి, ఆర్ట్: డి. వై. సత్య నారాయణ, మాటలు: కళ్యాణ్ రాఘవ్, పాటలు: శ్రీమణి, చైతన్య ప్రసాద్, శ్రీవల్లి.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved