pizza
Anushka First Look Simultaneous Release In Telugu, Tamil And Malayalam
తెలుగు, త‌మిళం, మ‌ళ‌యాల భాష‌ల్లో ఏక‌కాలంలో అనుష్క, అశోక్, యువి క్రియేషన్స్ భాగమతి ఫస్ట్ లుక్ విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

6 November 2017
Hyderabad

Actress Anushka became a household name after the humongous success of Baahubali series. She indeed has garnered fans frenzy worldwide with her mesmerizing performance in India’s biggest hit film. Now, the leggy lasso is set to enthrall with her stellar show in her upcoming film Bhagmati.

Bhagmati first look unveiled by the unit has mounted up curiosity on the film. Director Ashok who made a super hit film Pilla Zamindar is helming the project. Vamshi, Pramod who delivered several hits under their production banner UV Creations and are making Saaho with young rebel star Prabhas in four languages are bankrolling Bhagmati.

While speaking on the occasion, producers said, “We are proud to make Bhagmati with Anushka who is in career best form and has earned immense fame and craze with Baahubali. First look of the film released simultaneously in Telugu, Tamil and Malayalam has hiked the expectations. The enthusiastic response is giving double energy to our team. Bhagmati is made of a winning story. Director Ashok is also exhibiting his brilliant making skills in helming the movie. Anushka’s performance is going to be major highlight of the film. Madhi’s cinematography will be a special attraction, whereas art work by Ravinder will be majestic. We are making the film with massive budget which is required for the gripping story penned by Ashok. SS Thaman’s music will elevate each and every scene in the movie. We will announce other details soon.”

Director Ashok said, “I’m glad to work under prestigious production house like UV Creations. I’m taking utmost care as most of the films made under the banner were blockbusters. You will see other angle in Anushka’s performance. I promise you that you will laud her acting in the film. Thaman’s music, Madhi’s camera work, Ravinder’s art work will take the film to another level. Story and screenplay of Bhagmati will surely captivate you. Suspense as well as thrilling elements will charm each and every section of the audiences. I thank one and all who are pleased with the first look.”

Cast: Anushka, Unni Mukundan, Jayaram, Asha Sharath, Murali Sharma, Dhanraj, Prabhas Srinu, Vidyullekha Raman, Deva Darshan, Talaivasal Vijay, Ajay Ghosh, Madhu Nandan etc.

Technicians:
Music – S Thaman
Cinematographer – R Madhi
Editor - Kotagiri Venkateshwara Rao
Production Designer - Ravinder
Producers – Vamsi, Pramod
Story, Screenplay, Direction - Ashok

తెలుగు, త‌మిళం, మ‌ళ‌యాల భాష‌ల్లో ఏక‌కాలంలో అనుష్క, అశోక్, యువి క్రియేషన్స్ భాగమతి ఫస్ట్ లుక్ విడుదల

టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ వండర్ బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న అనుష్క నటించిన తాజా తెలుగు చిత్రం భాగమతి. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో అనుష్క నటించిన తీరు అందర్నీ అబ్బురపరిచింది. ఇదే తరహాలో... భాగమతిగా అనుష్క తన పెర్ ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేయనుంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. పిల్ల జమీందార్ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ అందించిన అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు. బంపర్ హిట్ చిత్రాల్ని నిర్మించి.... రెబల్ స్టార్ ప్రభాస్ తో నాలుగు భాషల్లో సాహో వంటి ప్రెస్టీజియస్ చిత్రాన్ని నిర్మిస్తున్న యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ భాగమతి చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం.

ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైన సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... బాహుబలి చిత్రంతో తన ఫేంను, క్రేజ్ ను మరింత పెంచుకొని సూపర్ ఫాంలో ఉన్న అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న భాగమతి చిత్రాన్ని మేం నిర్మిస్తున్నందుకు గర్వంగా ఫీలవుతున్నాం. ఈ చిత్ర ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఏక‌కాలంలో తెలుగు, త‌మిళం, మ‌ళ‌యాలం లో విడుద‌ల చేసిన‌ ఈ ఫస్ట్ లుక్ కు వస్తున్న రెస్పాన్స్ మా టీంకు మంచి ఎనర్జీ ఇచ్చింది. ఈ చిత్ర కథ అద్భుతంగా కుదిరింది. చెప్పిన దానికి మించి దర్శకుడు అశోక్ అద్బుతంగా తెరకెక్కించాడు. అనుష్క పెర్ పార్మెన్స్ ఈ సినిమాకు హైలైట్ కానుంది. మథి కెమెరా వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్. ఆర్ట్ రవీందర్ వేసిన సెట్స్ గ్రాండియర్ గా ఉంటాయి. కథకు తగ్గట్టుగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. తమన్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతీ సన్నివేశాన్ని హైలైట్ చేసేదిగా ఉంటుంది. భాగమతి కథ, కథనం తెలుగు ప్రేక్షకుల్ని తప్పకుండా ఎంటర్ టైన్ చేస్తుంది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తాం. అని అన్నారు.

దర్శకుడు అశోక్ మాట్లాడుతూ... యువి క్రియేషన్స్ లాంటి ప్రెస్టీజియస్ బ్యానర్లో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. వరుస సూపర్ హిట్స్ అందిస్తున్న బ్యానర్ కావడంతో భాగమతి చిత్ర విషయంలో చాలా కేర్ తీసుకొని రూపొందిస్తున్నాం. అనుష్క పెర్ ఫార్మెన్స్ లో మరో కోణాన్ని ఇందులో చూడొచ్చు. ఆమె పెర్ పార్మెన్స్ కు హాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. తమన్ మ్యూజిక్, రవీందర్ ఆర్ట్ వర్క్, మధి కెమెర్ వర్క్ ఈ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లింది. భాగమతి చిత్ర కథ, కథనం... అబ్బురపరిచే విధంగా ఉంటుంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రతీ ప్రేక్షకుడిని ఎంటర్ టైన్ చేసే విధంగా ఉంటాయి. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతీ ప్రేక్షకుడికి ధన్యవాదాలు. అని అన్నారు.

నటీనటులు - అనుష్క, ఉన్ని ముకుందన్, జయరాం, ఆశా శరత్, మురళీ శర్మ, ధన్ రాజ్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ రామన్, దేవ దర్శిని, తలైవాసల్ విజయ్, అజయ్ ఘోష్, మధు నందన్

సంగీతం - ఎస్.ఎస్.తమన్
సినిమాటోగ్రాఫర్ - మథి
ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావ్
ప్రొడక్షన్ డిజైనర్ - రవీందర్
నిర్మాతలు - వంశీ - ప్రమోద్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - అశోక్

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved