14 January 2015
Hyderabad
శ్రీ దివ్య, క్రాంతి, హేమంత్ నటీనటులుగా నూతన నిర్మాణ సంస్థ కాస్మిక్ ఇమాజినేషన్స్ పతాకంపై పెన్మత్స వివేకానంద వర్మ నిర్మిస్తున్న చిత్రం 'వారధి'. సతీష్ కార్తికేయ ఈ చిత్రానికి దర్శకుడు. 'మల్లెలతీరం సిరిమల్లె పువ్వు' చిత్రంతో ప్రేక్షకులను అలరించిన క్రాంతి, శ్రీదివ్యలు ఈ చిత్రంలో మరోసారి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం కూడా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ కావడం విశేషం. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేశారు. చిత్ర టైటిల్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుంది.
ఈ సందర్భంగా నిర్మాత వివేకానంద వర్మ మాట్లాడుతూ... వినోదాత్మకంగా తెరకెక్కించిన ముక్కోణపు ప్రేమకథ 'వారధి'. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో దర్శకుడు సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా మలిచారు. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్. విజయ్ గొర్తి చక్కని సంగీతం అందించారు. త్వరలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఫిబ్రవరి రెండవ వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. అని అన్నారు.
ఎమ్మెస్ నారాయణ, కృష్ణ భగవాన్ , శ్రీనివాస రెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈచిత్రానికి ఎడిటర్ : కార్తీక్ శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్ : రాజేంద్ర కేసాని, పాటలు : చైతన్య వర్మ, సంగీతం : విజయ్ గొర్తి, నిర్మాత : పెన్మత్స వివేకానంద వర్మ, దర్శకత్వం : సతీష్ కార్తికేయ