pizza
Sai Pallavi’s First Look In Rana’s Virataparvam Released
రానా చిత్రం 'విరాట‌ప‌ర్వం'లో సాయిప‌ల్ల‌వి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల
You are at idlebrain.com > news today >
Follow Us

09 May 2020
Hyderabad

The kind of films and roles she did tells the kind of actor she is. With a refreshing screen-presence and dazzling performance in previous films, the ravishing belle stole the hearts of many. Yes, the actress we are talking about is none other than Sai Pallavi who turns a year older today.

On the special occasion, first look poster of Sai Pallavi from her ongoing film Virataparvam is released. Of course, it is not a regular first look poster. Sai Pallavi here is seen waiting for somebody at Martyrs Memorial (Amaraveerula Sthoopam) and in the meantime she is apparently is noting down her thoughts in a memoir. The dressing is simple like any other ordinary girl. But, what grabs everyone’s attention is the pain she’s undergoing in the process of waiting for the one she loves the most.

Virataparvam is a unique and content driven film where Rana Daggubati will be seen in the lead role. The film will show the lead pair in never seen before roles. If not lockdown was imposed, the film would have been ready for release now. Except for last and small shooting schedule, entire filming is completed.

Needi Naadi Oke Katha fame is directing Virataparvam while D Suresh Babu is presenting it and Sudhakar Cherukuri of Sri Lakshmi Venkateswara Cinemas is bankrolling.

Priyamani, Nanditha Das, Naveen Chandra, Zareena Wahab, Eswari Rao and Sai Chand will be seen in important roles in the film that has music by Suresh Bobbili.

Cast:

1. Rana Daggubati
2. Sai Pallavi
3. Priyamani
4. Nanditha Das
5. Naveen Chandra
6. Zareena Wahab
7. Eswari Rao
8. Sai Chand
9. Benarji
10. Nagineedu
11. Rahul Ramakrishna
12. Devi Prasad
13. Anand Ravi
14. Anand Chakrapani

Crew:

Writer & Director: Venu Udugula

Producer: Sudhakar Cherukuri.

Banner: Suresh Productions, Sri Lakshmi Venkateswara Cinemas

Presents: Suresh Babu

DOP: Dani Sanchez Lopez, Divakar Mani

Editor: Sreekar Prasad

Production designer: Sri nagendra

Music: Suresh Bobbili

Stunts: Stephen Richard

Choreography: Raju Sundaram.

PRO: Vamsi - Sekhar

Executive producer: Vijay kumar chaganti

Publicity Design: Dhani Aelay

Telugu :
రానా చిత్రం 'విరాట‌ప‌ర్వం'లో సాయిప‌ల్ల‌వి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

ఆమె చేసిన చిత్రాలు, పాత్ర‌లే ఆమె ఎలాంటి న‌టో తెలియ‌జేస్తాయి. మునుపటి చిత్రాలలో సూప‌ర్బ్‌ స్క్రీన్‌-ప్రెజెన్స్‌, అద్భుతమైన నటనతో ఆ చ‌లాకీ తార అనేక‌ మంది హృదయాలను దొంగిలించింది. అవును, మనం మాట్లాడుతున్న నటి మరెవరో కాదు.. సాయి పల్లవి. ఈ రోజు ఆమె పుట్టిన‌రోజు.

ఈ ప్రత్యేక సందర్భంగా, త‌ను న‌టిస్తోన్న తాజా చిత్రం 'విరాటపర్వం'లో సాయి పల్లవి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. వాస్తవానికి, ఇది రెగ్యుల‌ర్‌ ఫస్ట్ లుక్ పోస్టర్ కాదు. ఇక్కడ సాయి పల్లవి అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఎవరి కోస‌మో ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు, ఈ సమయంలో ఆమె తన ఆలోచ‌న‌ల‌ను రాసుకుంటున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఆమె డ్రెస్సింగ్ ఇతర సాధారణ తెలుగింటి అమ్మాయిల మాదిరిగా చాలా సింపుల్‌గా ఉంది. కానీ, ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించేది, త‌ను ఎక్కువగా ఇష్టపడేవారి కోసం ఎదురుచూడ్డంలో ఆమె అనుభవిస్తున్న బాధ.

'విరాటపర్వం' ఒక ప్రత్యేకమైన, కంటెంట్ ప్ర‌ధాన‌ చిత్రం. ఇందులో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇదివ‌ర‌కెన్న‌డూ మ‌నం చూడ‌ని పాత్ర‌ల్లో హీరో హీరోయిన్లను ఈ చిత్రం చూపించ‌బోతోంది. లాక్‌డౌన్ విధించకపోతే, ఈ చిత్రం ఈ స‌రికి విడుదలకు సిద్ధంగా ఉండేది. చిన్న‌పాటి చివరి షూటింగ్ షెడ్యూల్ మినహా, మొత్తం చిత్రీకరణ పూర్తయింది.

'నీదీ నాదీ ఒకే క‌థ' ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తోన్న 'విరాట‌ప‌ర్వం' చిత్రాన్ని డి. సురేష్‌బాబు స‌మ‌ర్పిస్తోండ‌గా, శ్రీల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, న‌వీన్ చంద్ర‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావు, సాయిచంద్ కీల‌క పాత్ర‌ధారులైన ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం స‌మ‌కూరుస్తున్నారు.

తారాగ‌ణం:
రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి, ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, న‌వీన్ చంద్ర‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావు, సాయిచంద్‌, బెన‌ర్జీ, నాగినీడు, రాహుల్ రామ‌కృష్ణ‌, దేవీప్ర‌సాద్‌, ఆనంద్ ర‌వి, ఆనంద్ చ‌క్ర‌పాణి

సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: వేణు ఊడుగుల‌
నిర్మాత‌: సుధాక‌ర్ చెరుకూరి
బ్యాన‌ర్స్‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, శ్రీ‌ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్‌
స‌మ‌ర్ప‌ణ‌: సురేష్‌బాబు
సినిమాటోగ్ర‌ఫీ: డానీ సాంచెజ్ లోపెజ్‌, దివాక‌ర్ మ‌ణి
ఎడిట‌ర్‌: శ్రీ‌క‌ర ప్ర‌సాద్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: శ్రీ నాగేంద్ర‌
సంగీతం: సురేష్ బొబ్బిలి
స్టంట్స్‌: స్టీఫెన్ రిచ‌ర్డ్‌
కొరియోగ్ర‌ఫీ: రాజు సుంద‌రం
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్‌కుమార్ చాగంటి
ప‌బ్లిసిటీ డిజైన్‌: ధ‌ని ఏలేPrivacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved