pizza
Melukoo Raithannaa.. Meluko.. Nuvvu Kolukoo Raithannaa.. Koluko..
Praja Gayakudu Gaddar In A Special Role In 'Software Sudheer'
'మేలుకో రైతన్నా.. మేలుకో.. నువ్వు కోలుకో రైతన్నా.. కోలుకో'
'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌' చిత్రంలో ప్రత్యేక పాత్రలో ప్రజా గాయకుడు గద్దర్‌
You are at idlebrain.com > news today >
Follow Us

31 July 2019
Hyderabad

Praja Gayakudu Gaddar's songs inspire many people. His songs bring awareness in the society. He is coming again with another song, 'Meluko Raithannaa...Meluko' which carries a very important message. Gaddar penned and crooned this song for 'Software Sudheer'. He also enacted in the song. This song delivers a solid message that youth should support farmers for the well being of society.

Speaking about the song Gaddar says, " I have penned and sang 'Meluko Raithannaa... Meluko' song for 'Software Sudheer' movie. I also acted in the song. Thanks to Producer Sekhar Raju, Director Rajasekhar for providing this opportunity to write and perform for this song which says that youth should walk with farmers. This film involves a very good message regarding farmers. I hope it will definitely connect with the farmers and bring awareness among the people."

Sudigaali Sudheer is starring as a hero in 'Software Sudheer' whereas Dhanya Balakrishna is playing as a heroine. 'Software Sudheer' is produced by K.Sekhar Raju in Sekhara Art Creations as production no - 1. Rajasekhar Reddy Pulicharla is debuting as director with this film.

Hero Sudigaali Sudheer says, " I got very excited when the director narrated this story and immediately agreed to do this film. It's due to the prayers of my parents, I got this opportunity to work with such popular technicians for my first film itself. It's fun to shoot with heroine Dhanya Balakrishna. Director Rajasekhar Reddy has a very good vision. It's an honor for us that Gaddar garu crooned and acted a song in our film. This film will surely impress everyone."

Producer K Sekhar Raju says, " I earned a lot of name and fame in business and my passion for movies made me a producer. Artists and Technicians are giving their best for this film. By God's grace, the shoot of the film is progressing very well. Gaddar garu sang and acted in an inspiring song for our film. Completing all works, we are planning to release the film in August."

Director Rajasekhar Reddy Pulicharla says, " This is a very good commercial family entertainer which also conveys a very good message. Gaddar gari song will be an asset for our film. We are honored to have him write, sing and act in our film. The song 'Meluko Raithannaa...' is very inspiring which says that youth should support the farmers."

Heroine Dhanya Balakrishna says, " I am doing a performance-oriented character. This film has loads of fun along with a superb message."

Sudigaali Sudheer, Dhanya Balakrishna will be seen as lead pair along with senior actress Indraja, Posani Krishnamurali, Sayaji Shinde, Siva Prasad, Hema, Vidyullekha, Tarzan in other important roles.

Editing: Gowtham Raju, Cinematography: Ram Prasad, Music: Bheems Cecerolio, Fights: Ram - Lakshman, Dance: Sekhar master, Publicity Designer: Dhani Aelay, Art Director: Narayana Muppala, Production Executive: Bhikshapathi Thummala, Songs: Suresh Banisetty, Producer: K Sekhar Raju, Story, Screenplay, Dialogues, Direction: Rajasekhar Reddy Pulicharla

'మేలుకో రైతన్నా.. మేలుకో.. నువ్వు కోలుకో రైతన్నా.. కోలుకో'
'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌' చిత్రంలో ప్రత్యేక పాత్రలో ప్రజా గాయకుడు గద్దర్‌

ప్రజా గాయకుడు గద్దర్‌ పాటలు ఎంతో చైతన్యవంతంగా ఉంటాయి. అందర్నీ మేలుకొలిపే విధంగా ఉంటాయి. అలాంటి ఎన్నో అద్భుతమైన పాటల ద్వారా ప్రజా గాయకుడిగా పేరు తెచ్చుకున్న గద్దర్‌ ఇప్పుడు 'మేలుకో రైతన్నా.. మేలుకో' అంటూ మరో సందేశాత్మక గీతంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌' చిత్రంలోని ఈ పాటను రచించి గానం చేశారు. యువతరాన్ని రైతాంగంతో కలిసి నడవమని చెప్పే చక్కని సందేశంతో కూడిన ఈ పాటలో గద్దర్‌ స్వయంగా నటించడం విశేషం.
ఈ పాట గురించి ప్రజా గాయకుడు గద్దర్‌ మాట్లాడుతూ - ''సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌ చిత్రంలో 'మేలుకో రైతన్నా.. మేలుకో.. నువ్వు కోలుకో రైతన్నా.. కోలుకో' అనే పాటను రచించి పాడాను. అలాగే సినిమాలోని ఆ పాటలో నేను నటించడం కూడా జరిగింది. యువతరాన్ని రైతాంగంతో కలిసి నడవమని చెప్పే మంచి పాటను రాసి నటించే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్‌ శేఖర్‌ రాజు, దర్శకుడు రాజశేఖర్‌గారికి వందనాలు. రైతుల గురించి మంచి సందేశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం రేపు ప్రజల్లోకి వెళ్లి ఆ రైతాంగాన్ని కదిలిస్తుందని నమ్ముతున్నాను'' అన్నారు.

సుడిగాలి సుధీర్‌హీరోగా, ధన్యాబాలక ష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై ప్రొడక్షన్‌ నెం-1గా కె.శేఖర్‌రాజు నిర్మిస్తున్న చిత్రం 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌'. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఈ సందర్భంగా హీరో సుడిగాలి సుధీర్‌ మాట్లాడుతూ - ''కథ చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించించి ఈ క్యారెక్టర్‌ చేయడానికి అంగీకరించాను. నా తల్లితండ్రులు చేసిన పూజల ఫలితంగానే హీరోగా నేను నటిస్తున్న మొదటి సినిమాకే ఇంత గొప్ప టెక్నిషియన్స్‌తో కలిసి వర్క్‌ చేసే అవకాశం దొరికింది. హీరోయిన్‌ ధన్యా బాలక ష్ణతో షూటింగ్‌ చాలా ఫన్‌గా సాగుతోంది. అలాగే దర్శకుడు రాజశేఖర్‌ రెడ్డిలో మంచివిజన్‌ ఉంది. మా సినిమాలో గద్దర్‌ వంటి ప్రముఖ గాయకుడు పాట పాడడం, నటించడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా తప్పకుండా మీ అందరి అంచనాలను అందుకుంటుంది'' అన్నారు.

ప్రొడ్యూసర్‌ కె.శేఖర్‌రాజు మాట్లాడుతూ - ''సినిమా రంగంపై ఉన్న ఫ్యాషన్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాను. దర్శకుడు ఆర్టిస్టులు, టెక్నిషియన్స్‌ నుండి మంచి సపోర్ట్‌ లభిస్తోంది. ఆ భగవంతుడి దయ వలన షూటింగ్‌ సజావుగా సాగుతోంది. మా సినిమాలోని ఓ ఇన్‌స్పైరింగ్‌ సాంగ్‌ను ప్రజాగాయకుడు గద్దర్‌ పాడడంతోపాటు సినిమాలో నటించారు కూడా. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ సినిమాను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

దర్శకుడు రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ - ''కమర్షియల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో పాటు మంచి సందేశాత్మక చిత్రం ద్వారా మీ ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. మా సినిమాకు గద్దర్‌గారి పాట పెద్ద ఎస్సెట్‌ అవుతుంది. యువతకు మంచి సందేశాన్నిచ్చే 'మేలుకో రైతన్నా..' పాటను రచించి ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా పాడడమే కాకుండా సినిమాలో నటించడం నిజంగా మా అదృష్టం'' అన్నారు.

హీరోయిన్‌ ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ - ''ఇందులో పెర్‌ఫార్మెన్స్‌ ఓరియంటెడ్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాను. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మంచి సందేశం కూడా ఉంది'' అన్నారు.

సుడిగాలి సుధీర్‌, ధన్య బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్‌ ఓ పాటలో నటించడం విశేషం. సీనియర్‌ నటి ఇంద్రజ, పోసాని కృష్ణమురళి, షాయాజీ షిండే, శివప్రసాద్‌, విద్యుల్లేఖ, టార్జాన్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: గౌతమ్‌రాజు, సినిమాటోగ్రఫీ: రామ్‌ప్రసాద్‌, మ్యూజిక్‌: భీమ్స్‌ సిసిరోలియో, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, డాన్స్‌: శేఖర్‌ మాస్టర్‌, పబ్లిసిటీ డిజైనర్‌: ధని ఏలె, ఆర్ట్‌ డైరెక్టర్‌: నారాయణ ముప్పాల, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: భిక్షపతి తుమ్మల, పాటలు: సురేష్‌ ఉపాధ్యాయ, ప్రొడ్యూసర్‌: కె.శేఖర్‌రాజు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved