pizza
Gajendrudu postponed
అనివార్య కారణాలతో గజేంద్రుడు చిత్రం విడుదల వాయిదా
You are at idlebrain.com > news today >
Follow Us

12 April 2017
Hyderabad

మూడు ద‌శాబ్దాలుగా ఎన్నో కుటుంబ క‌థాచిత్రాలతో సూప‌ర్ డూప‌ర్ చిత్రాల‌ను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సూప‌ర్ గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.బి.చౌద‌రి నిర్మాత‌గా ప్రోడ‌క్ష‌న్ 89 గా రూపొందిన చిత్రం `గ‌జేంద్రుడు`. ఆర్య‌, కేథరీన్ హీరో హీరోయిన్లుగా న‌టించారు. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో కి ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రం సెన్సారు కార్యక్ర‌మాలు పూర్తిచేసుకుంది, అయితే ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుద‌ల‌ చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనివార్య కారణాలతో విడుదల వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. గజేంద్రుడు చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేసేది త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు తెలియజేశారు.

నిర్మాత ఆర్‌.బి.చౌద‌రి గారు మాట్లాడుతూ..మా సూప‌ర్‌గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్లో వ‌స్తున్నప్రోడ‌క్ష‌న్‌నెం 89వ సినిమా `గ‌జేంద్రుడు`. ఈ చిత్రం ఆర్య కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ మూవీ అవుతుంది. క్యాథ‌రిన్ ఎంతో చ‌క్క‌గా న‌టించింది. హీరో హీరోయిన్స్ ఇద్ద‌రూ పాత్ర‌కు త‌గ్గట్టుగా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశారు. క‌థ‌కి త‌గ్గ‌ట్టుగా వీరి బాడీ లాంగ్వేజ్ ని మార్చుకున్నారు. 14న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాం. కానీ అనివార్య కారణాలతో సినిమా విడుదల వాయిదా వేశాం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. గ‌జేంద్రుడు ఈ స‌మ్మ‌ర్ కి ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంది. ఫ్యామిలి అంతా ఎంజాయ్ చేసే చిత్రంగా మా గ‌జేంద్రుడు వుంటుంది. యువ‌న్‌శంక‌ర్ రాజా మంచి సంగీతాన్ని అందించారు. డైరెక్ట‌ర్ రాఘ‌వ ఎంతో హార్డ్ వ‌ర్క్ చేశారు. అని అన్నారు.

హీరో ఆర్య మాట్లాడుతూ.. నేను ఎప్పుడు కొత్త చిత్రం చేసినా ప్రేక్ష‌కులు ఆద‌రించారు. మ‌రో కొత్త చిత్రం ఈ గ‌జేంద్రుడు. కంటెన్ట్‌బేస్‌డ్ సినిమాల‌ను చేసే నిర్మాత‌ల్లో ఆర్‌.బి.చౌద‌రిగారు నిర్మించారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా మొత్తం చేయాలంటే అంత సుల‌భం కాదు. చౌద‌రిగారి స‌పోర్ట్ లేకుంటే ఈ సినిమా చేసేవాళ్ళం కాదు. క్యాథ‌రిన్ ఎంతో స‌పోర్ట్ చేసింది. డైరెక్ట‌ర్ రాఘ‌వ రెండో సినిమానే ఇలాంటి కొత్త కాన్సెప్ట్‌తో చేశాడు. త‌న మంచి ప‌ట్టున్న ద‌ర్శ‌కుడు త‌ను భ‌విష్య‌త్‌లో తెలుగు, త‌మిళంలో పెద్ద ద‌ర్శ‌కుడుగా ఎదుగుతాడు. ఈ చిత్రం త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. అని హీరో ఆర్య అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved