
14 February 2020
Hyderabad
హీరో విజయ్ దేవరకొండ స్థాపించిన ‘‘దేవరకొండ ఫౌండేషన్’’ చేసిన చిన్న ఆర్థిక సహాయం ఓ యువ క్రీడాకారుడి కెరీర్ కు దోహదపడింది. మెదక్ జిల్లాకు చెందిన కిక్ బాక్సర్ గణేష్ ఎంబారి న్యూఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ కి పోటీపడుతున్నాడు.కానీ అక్కడ పాల్గొనేందుకు కావాల్సిన ఫీజ్ కోసం ఇబ్బంది పడుతున్నాడు..ఫ్యాన్స్ ద్వారా విషయం తెలుసుకున్న హీరో విజయ్ తమ ‘‘దేవరకొండ ఫౌండేషన్’’ నుండి ఆ పార్టిసిపేషన్ ఫీజ్ 24 వేలు ఆర్థిక సహాయం చేశారు.ఫిబ్రవరి 1న ఆ చెక్ ను దేవరకొండ గోవర్ధన్ రావు క్రీడాకారుడు గణేష్ కు అందజేశారు.
ఆ సహాయంతో న్యూడిల్లీ వెళ్ళిన గణేష్ ఈ నెల 13న జరిగిన పోటీలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాడు.యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే హీరో విజయ్ చేసిన ఆ సహాయం వల్లే తాను ఆ పోటీల్లో పార్టిసిపేట్ చేయగలిగి, గోల్డ్ మెడల్ సాధించాననీ గణేష్ ఎంబారి సంతోషం వ్యక్తం చేశాడు.


