pizza
Ganta Ravi, Jayanth C. Paranjee, Ashok Kumar movie title – Jayadev
గంటా రవి హీరోగా జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో కె.అశోక్‌కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం పేరు 'జయదేవ్‌'
You are at idlebrain.com > news today >
Follow Us

29 March 2017
Hyderabad

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై ప్రేమించుకుందాం..రా, బావగారూ బాగున్నారా, ప్రేమంటే ఇదేరా, టక్కరి దొంగ, ఈశ్వర్‌, లక్ష్మీ నరసింహా, శంకర్‌దాదా ఎంబిబిఎస్‌ వంటి హిట్‌ చిత్రాలను రూపొందించిన డీసెంట్‌ డైరెక్టర్‌ జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్‌కుమార్‌ నిర్మిస్తున్న కొత్త చిత్రానికి ఉగాది పర్వదినం సందర్భంగా 'జయదేవ్‌' అనే టైటిల్‌ని ప్రకటించారు.

ఈ సందర్భంగా నిర్మాత కె.అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ - ''వెంకటేష్‌తో రక్తతిలకం, ధృవనక్షత్రం వంటి సూపర్‌హిట్‌ చిత్రాలు నిర్మించిన తర్వాత శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై జయంత్‌ సి. పరాన్జీ దర్శకత్వంలో వెంకటేష్‌ హీరోగా ప్రేమంటే ఇదేరా, ప్రభాస్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఈశ్వర్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించడం జరిగింది. ఈ బేనర్‌లో మూడో చిత్రంగా జయంత్‌ దర్శకత్వంలో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుగారి తనయుడు గంటా రవి హీరోగా పరిచయం చేస్తూ పవర్‌ఫుల్‌, పర్పస్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా నిర్మిస్తున్న చిత్రానికి ఉగాది పర్వదినాన 'జయదేవ్‌' అనే టైటిల్‌ని కన్‌ఫర్మ్‌ చేశాము. డిసెంబర్‌ 9న షూటింగ్‌ స్టార్ట్‌ చేశాం. హైదరాబాద్‌, మేడ్చల్‌, సిద్దాలగుట్ట టెంపుల్‌, కె.జి.రెడ్డి కాలేజ్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ, మహబూబ్‌ నగర్‌లోని పిల్లల మర్రి, తదితర ప్రాంతాల్లో నాన్‌స్టాప్‌గా జరిగిన షూటింగ్‌తో 80 శాతం చిత్రం పూర్తయింది. రెండున్నర పాటలు బ్యాలెన్స్‌ వున్నాయి. అందులో ఒక ఐటమ్‌ సాంగ్‌ని హైదరాబాద్‌లో వేసే భారీ సెట్‌లో చిత్రీకరిస్తాం. మిగిలిన ఒకటిన్నర పాటలను ఏప్రిల్‌ 22 నుంచి 29 వరకు స్విట్జర్లాండ్‌లో జరిగే షెడ్యూల్‌లో చిత్రీకరించడం జరుగుతుంది. దీంతో టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది'' అన్నారు.

దర్శకుడు జయంత్‌ సి.పరాన్జీ మాట్లాడుతూ - ''ఒక మంచి పోలీస్‌ ఆఫీసర్‌ కథ ఇది. కర్తవ్య నిర్వహణ కోసం కుటుంబాన్ని, జీవితాన్ని శాక్రిఫైస్‌ చేసే ఎంతో మంది పోలీస్‌ ఆఫీసర్ల ఇన్‌స్పిరేషన్‌తో రూపొందిన క్యారెక్టర్‌ జయదేవ్‌. అందర్నీ ఆకట్టుకునే అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. దాదాపు పది యాక్షన్‌ ఎపిసోడ్స్‌ వుంటాయి. అన్నీ కథలో లింక్‌ అయి వుంటాయి. ఈశ్వర్‌ చిత్రం ఇదే బేనర్‌లో ప్రభాస్‌ని హీరోగా ఇంట్రడ్యూస్‌ చేశాం. ఆ చిత్రం తర్వాత మళ్ళీ అశోక్‌కుమార్‌గారి బేనర్‌లోనే 'జయదేవ్‌' చిత్రంతో గంటా శ్రీనివాసరావుగారి తనయుడు గంటా రవిని హీరోగా నా దర్శకత్వంలో పరిచయం చేయడం ఆనందంగా వుంది'' అన్నారు.

పరుచూరి బ్రదర్స్‌లో ఒకరైన పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ - ''పోలీస్‌ కథ అనగానే మనకి కర్తవ్యం, అంకుశం లాంటి చిత్రాలు గుర్తొస్తాయి. అలా ఓ మంచి పోలీస్‌ ఆఫీసర్‌ కథ ఈ 'జయదేవ్‌'. పోలీస్‌ చిత్రాల్లో ఓ మరపురాని చిత్రంగా జయంత్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు'' అన్నారు.

గంటా రవి, మాళవిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వినోద్‌కుమార్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని, వెన్నెల కిషోర్‌, హరితేజ, శ్రావణ్‌, సుప్రీత్‌, కోమటి జయరామ్‌, రాజేశ్వరి, శివారెడ్డి, కాదంబరి కిరణ్‌, బిత్తిరి సత్తి, కరుణ, మీనా, జ్యోతి, రవిప్రకాష్‌, అరవింద్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: జవహర్‌రెడ్డి, మూల కథ: అరుణ్‌కుమార్‌, రచన: పరుచూరి బ్రదర్స్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: కృష్ణమాయ, స్టిల్స్‌ నారాయణ, కో-డైరెక్టర్‌: ప్రభాకర్‌ నాగ్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: పి.రామమోహన్‌రావు, నిర్మాత: కె.అశోక్‌కుమార్‌, దర్శకత్వం: జయంత్‌ సి. పరాన్జీ.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved