pizza
Gautamiputra Satakarni censor on 5 January
You are at idlebrain.com > news today >
Follow Us

30 December 2016
Hyderaba
d

నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జనవరి 5న ఈ చిత్రం సెన్సార్ కి వెళుతుందని తెలుస్తోండగా, సంక్రాంతికి ఈ సినిమాను తప్పక విడుదల చేయాలని యూనిట్ బాగా కష్టపడుతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. సినిమాని జనాలలోకి తీసుకెళ్లేందుకు క్రిష్ వేస్తోన్న ప్లాన్స్ అదరహో అనిపిస్తున్నాయి. రీసెంట్ గా జరిగిన ఆడియో ఈవెంట్ కోసం డిజిటల్ ఇన్విటేషన్ లు తయారు చేయించిన క్రిష్ ఇప్పుడు అభిమానులకు బంపర్ ఆఫర్స్ ఇస్తున్నాడు.‘గౌతమిపుత్ర శాతకర్ణి లాయల్టీ కాంటెస్ట్’ పేరుతో ఒక పోటీ పెట్టిన క్రిష్ ఇందులో పాల్గొనాలంటే గౌతమిపుత్ర శాతకర్ణి.కాంలోకి వెళ్లి పాల్గొనవచ్చు అని తెలిపాడు. ఈ వెబ్ సైట్లో శాతకర్ణితో పాటు శాతావాహనుల అద్భుత చరిత్ర, బాలయ్య వంద సినిమాల ప్రస్థానాన్ని పొందు పరిచారు. అయితే ఒక్కసారి వెబ్ సైట్లో ఎంటరైన తర్వాత గౌతమీపుత్ర శాతకర్ణి లాయల్టీ కాంటెస్టులో వారు అడిగే ప్రశ్నలకు మీరు ఇచ్చే సమాధానాల ద్వారా కోడ్స్ ఇస్తారు. ఆ కోడ్స్ ద్వారా శాతవాహనుల రాజ్యానికి చెందిన అమరావతి.. అనూప.. విదర్భ.. సౌరాష్ట్ర.. అవంతి.. అసిక రాజ్యాల్లో మీరు జయించాలనుకున్న రాజ్యాలను ఎంచుకోవాలి. క్విజ్‌లో ఫ్రెండ్స్‌, ప్యామిలీ రెఫ‌రెన్స్‌, ఫేస్‌బుక్‌, రేడియోల ద్వారా షేర్ చేయ‌బోయే కోడ్స్ వంటి యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేసి స్పిన్ వీల్ తిప్పండి. త‌ద్వారా మీ రాజ్య బుద్ధి, భుజ‌, గ‌జ‌, అశ్వ‌, ఆయుధ బ‌ల‌గాల‌ను పెంచుకుని ఆ రాజ్యాల‌ను జ‌యించండి. ఈ రాజ్యాలను జయించడం ద్వారా పాయింట్లు కూడగట్టి లీడర్ బోర్డ్ లో టాప్ కు చేరుకుంటారు. వాటి ద్వారా పలు బహుమతులు గెలుచుకోవచ్చు.ఇక బాలయ్యని కలవానుకుంటే ఆయన ఆధ్వర్యంలో నడిచే బసవతారకమ్మ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి కొంత చందా అందజేస్తే బాలకృష్ణతో కలిసి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ప్రిమియర్ షో చూసే అవకాశం కలుగుతుంది. అంతేకాదు ఆయనతో కలిసి డిన్నర్ చేసే అవకాశాన్ని కూడా చిత్ర యూనిట్ అందజేస్తోంది. మరి అభిమానులు ఇంకెందుకు ఆలస్యం గౌతమిపుత్ర శాతకర్ణి లాయల్టీ కాంటెస్ట్ లో పాల్గొనండి. పలు బహుమతులతో పాటు బాలయ్యతో కలిసి డిన్నర్ చేసే అవకాశాన్ని అందుకోండి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved