pizza
Gautamiputra Satakarni first song shoot from today
నేటి నుండి 'గౌతమి పుత్ర శాతకర్ణి` మొద‌టి పాట చిత్రీకరణ
You are at idlebrain.com > news today >
Follow Us

17 September 2016
Hyderaba
d

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై రూపొందుతోన్న ప్రెస్టిజియస్‌ మూవీ 'గౌతమిపుత్ర శాతకర్ణి'. నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సినిమాకు చిరంతన్‌ భట్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా....

చిత్ర నిర్మాతలు వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు మాట్లాడుతూ - ''ఈ చిత్రానికి గతంలో క్రిష్‌ దర్శకత్వం వహించిన జాతీయ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ కంచె చిత్రానికి సంగీతం అందించిన చిరంతన్‌భట్‌ను దేవిశ్రీ ప్రసాద్‌ స్థానంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తీసుకున్నాం. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన సీనియర్‌ డ్యాన్స్‌ మాస్టర్‌ స్వర్ణ నృత్య దర్శకత్వంలోనీ సాంగ్‌ను మధ్యప్రదేశ్‌లో చిత్రీకరించనున్నారు. ముంబైకి చెందిన క్లాసికల్‌ డ్యాన్సర్స్‌ ఈ పాటలో నర్తిస్తున్నారు.

ఈ నాలుగో షెడ్యూల్‌లో బాల‌కృష్ణ‌, శ్రియ‌, క‌బీర్ బేడి, హేమామాలిని పాల్గొన్న రాజసూయ యాగం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేశాం. బాలకృష్ణ ఇతర తారాగణంపై అద్భుతమైన రాజదర్బార్‌ సెట్‌లో ఓ సాంగ్‌ను చిత్రీక‌రిస్తున్నాం. సెప్టెంబర్‌ 25 వరకు జరిగే ఈ సాంగ్‌ చిత్రీకరణతో తాజా షెడ్యూల్‌ పూర్తవుతుంది. ఈ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌తో 80 శాతం సినిమా పూర్తవుతుంది. వి.ఎఫ్‌.ఎక్స్‌ కోసం నాలుగు స్పెషల్‌ టెక్నికల్‌ టీమ్‌లు పనిచేస్తున్నాయి. సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హేమామాలిని, శ్రేయ, క‌బీర్ బేడి త‌దిత‌ర‌లు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి, సంగీతంః చిరంత‌న్ భ‌ట్‌, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved