pizza
Gautamiputra Satakarni gets U/A censor certificate
సింగిల్ కట్ లేకుండా సెన్సార్ పూర్తి చేసుకొన్న శాతకర్ణి!
You are at idlebrain.com > news today >
Follow Us

5 January 2017
Hyderaba
d

Nandamuri Balakrishna and Krish teamed up for most powerful and historical entertainer Gautamiputra Satakarni. The prestigious film made as Balakrishna’s 100th is slated for Sankranti release.

Gautamiputra Satakarni completed censor formalities today and received U/A rating from the censor board, gearing for grand worldwide release on January 12th. The movie is going to explore the untouched era of greatest and first Telugu emperor who ruled entire India. This point has never been dealt before in Telugu cinema and is a matter of pride for Telugu audience.

Balakrishna’s royal ferocious look as Gautamiputra Satakarni is coming in with lot of appreciations on social media and Telugu audience worldwide are excited to watch their history on big screens. Shriya Saran is playing heroine Vashishti Devi while Hema Malini is doing mother character Gautami Balasri.

“GPSK has been made on a very high budget, marvelous technical values with shooting being done in Morocco, Georgia and other locations in India. Our film has come out with extra ordinary quality. Censor formality has been completed today receiving U/A certification with runtime locked at 2 hours 15 minutes.

Censor board members are delighted with Balakrishna’s startling performance. They have appreciated the visual opulence, action episodes, quality RR and strong emotional depth in content. GPSK will invade theaters all over the world on January 12th,” said producers.

Casting: Balakrishna, Hema Malini, Shriya Saran, Kabeer Bedi and others.
Presenter: Bibo Srinivas
Cinematographer: Gnanashekhar
Art: Bhupesh Bhupathi
Lyrics: Sirivennela Sitarama Shastri
Dialogues: Saimadhav Burra
Fights: Ram Lakshman
Music: Chirantan Bhatt
Co producer: Kommineni Venkateswara Rao
Producers: Y Rajiv Reddy, Jagarlamudi Saibabu
Director: Krish

సింగిల్ కట్ లేకుండా సెన్సార్ పూర్తి చేసుకొన్న శాతకర్ణి!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ "గౌతమీపుత్ర శాతకర్ణి" నేడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. శాతవాహన మహారాజు "శాతకర్ణి" జీవితం ఆధారంగా క్రిష్ తెరకెక్కించిన హిస్టారికల్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై బిబో శ్రీనివాస్ సమర్పణలో వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు నిర్మించారు. బాలకృష్ణ సరసన శ్రేయ "వశిష్ట మహాదేవి"గా ముఖ్యభూమిక పోషించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటీమణి హేమమాలిని శాతకర్ణుడి వీరమాత "గౌతమి"గా ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం. జనవరి 5న "గౌతమీపుత్ర శాతకర్ణి" చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు సింగిల్ కట్ కూడా లేకుండా "యు/ఎ" సెర్టిఫికేట్ ఇచ్చారు. శాలివాహన శకం నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని క్రిష్ ఓ దృశ్యకావ్యంలా తెరకెక్కించారని, సినిమా చూస్తున్నంతసేపు గౌతమిపుత్ర శాతకర్ణుడిగా నందమూరి నటసింహం బాలకృష్ణ నటన అద్భుతంగా ఉందని సెన్సార్ సభ్యులు క్రిష్ అండ్ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు మాట్లాడుతూ.. "మా శాతకర్ణి సెన్సార్ పూర్తయ్యింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు "సినిమా అద్భుతంగా ఉంది" అంటూ అభినందనలు తెలపడంతోపాటు.. బాలకృష్ణ నటవిశ్వరూపం, భారీ వ్యయంతో తెరకెక్కించిన యుద్ధ సన్నివేశాలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న "గౌతమిపుత్ర శాతకర్ణి" ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నందమూరి అభిమానులనే కాక యావత్ తెలుగు సినిమా అభిమానులను విశేషంగా అలరించడం ఖాయం" అన్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ణానశేఖర్, సంగీతం: చిరంతన్ భట్, కళ: భూపేష్ భూపతి, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంభాషణలు: సాయిమాధవ్ బుర్ర, పోరాటాలు: రామ్-లక్ష్మణ్, సహనిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వర్రావు, సమర్పణ: బిబో శ్రీనివాస్, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్!

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved