pizza
Gautamiputra Satakarni Shooting in Morocco
మొరాకోలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సందడి
You are at idlebrain.com > news today >
Follow Us

10 May 2016
Hyderaba
d

నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రధారిగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ మే 9న మొరాకోలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో హాలీవుడ్ ఫైటర్స్ సహకారంతో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా

దర్శకుడు జాగర్లమూడి క్రిష్ మాట్లాడుతూ ‘’మొరాకోలో మూడు వారాల పాటు చిత్రీకరణ జరుపుతాం. హాలీవుడ్ టెక్నిషియన్స్ సహకారంతో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను రూపొందిస్తున్నారు. సినిమా మొదటి రోజు పూర్తయ్యింది. బాలకృష్ణగారు, కబీర్ బేడిగారు తదితరులు ఈ షెడ్యూల్ లో ఉత్సాహంతో పాలు పంచుకున్నారు. తొలిరోజు సన్నివేశాలు అనుకున్న దానికంటే బాగా రావడంతో చాలా హ్యపీగా ఉన్నాం’’అన్నారు.

నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved