pizza
Geethanand interview (Telugu) about Ratham
హై ఇన్ టెన్స్ ల‌వ్ స్టోరి `రథం` - గీతానంద్‌
You are at idlebrain.com > news today >
Follow Us

22 October 2018
Hyderabad

రాజ్ గురు బ్యానర్ పై చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో రాజ్ ధారపనేని నిర్మించిన చిత్రం `రథం` ఈ చిత్రంలో గీతానంద్, చాందీనిభగవనేనీ జంటగా న‌టించారు. ఈ నెల 26 న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సందర్భంగా పాత్రికేయులతో హీరో గీతానంద్ మాట్లాడుతూ..

నేప‌థ్యం...
`ర‌థం` చిత్రం దాదాపు ఐదారేళ్ల‌ నుంచి నడుస్తుంది. 2013లో మొదలైన జర్నీ ఇది. దీనికంటే ముందు `పంతం` అనే సినిమా మొదలై ఆగిపోయింది. ఇది ఆపకూడదనే ప్యాషన్ తో వచ్చాను. నేను పుట్టిన ఊరు గుంటూరు. హైదరాబాద్ లోనే చదువుకున్నాను. నానమ్మ దగ్గర పెరిగాను. మా నాన్నగారు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తే కానీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఒబుల్ రెడ్డి స్కూల్‌లోనే చ‌దువుకున్నాను. తర్వాత బి బి ఎ కంప్లీట్ చేశాను. నేను 10వ తరగతి చదువుతున్నప్పటినుంచే సినిమాలంటే ఇష్టం . నేను సినిమా లవర్ ని. చిన్నప్పటినుంచి ఫ్రెండ్స్ కి కథలు చెప్పేవాడ్ని. డాడీ కి తెలియకుండా ఒకసారి ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించాను. మా నాన్నగారు చూసి చాలా ఆశ్చర్య పోయారు. ఆ తర్వాత రెండు, మూడు షార్ట్ ఫిలిమ్స్ లో నటించాను. తర్వాత కొన్ని ఫిలిమ్స్ లో చిన్న కారెక్టర్ చేవాను. ` ధ‌నం మూలం ఇదం జ‌గ‌త్` చిత్రంలో న‌టించాను.

ఆగిపోకూడ‌ద‌ని...
- మా డైరెక్టర్ నాకు 2013 నుంచి పరిచయం మా నాన్నగారి ఫ్రెండ్ కి ఫ్రెండ్. చంద్రశేఖర్ యేలేటి దగ్గర పని చేశారు. ముందు `పంతం` అని ఒక సినిమా కోసం డెమో షూట్ చేసాం.10 డేస్ త‌ర్వాత షూట్ జరిగి ఆగిపోయింది. దాంతో చాలా డిస‌ప్పాయింట్‌ అయ్యాను. మ‌ధ్య‌లోనే ఆప‌కూడ‌ద‌ని ఈ చిత్రం మొదలుపెట్టాం. చంద్రశేఖర్ గారే రథం అనే టైటిల్ తీసుకుని వచ్చారు. తర్వాత ప్రొడ్యూసర్ రాజన్న వచ్చారు ఆయన వచ్చాక ఎక్కడ ఆగలేదు.

చాలా లేయ‌ర్స్ ఉంటాయి...
- `రథం` అనే చిత్రం వెనక్కి తిరిగి చూడకుండా ముందుకెళ్లే ల‌వ్‌ స్టోరీ హై ఇన్సిడెంట్ డ్రామా. హీరో ఒక రైతు. రైతులకు మోడరన్ పరికరాలు అవి చేసేవాడు. చాలా అందమైన డీప్ రొమాన్స్ చాలా లేయర్లు ఉంటాయి ఈ చిత్రంలో. 4 పాటలు, 2 బిట్ సాంగ్స్ ఉంటాయి. షూటింగ్ మొత్తం కడప, జమ్మలమడుగులో జరిగింది. 45 రోజుల్లో మొత్తం షూటింగ్ పూర్తయింది.

హీరోయిన్ గురించి...
- చాందిని కి కూడా ఇదే మొదటి చిత్రం కానీ చాలా బాగా చేసింది. తనకు తెలుగు రాదు అయిన కూడా నేర్చుకోడానికి ప్రయత్నించి బాగా చేసింది. తాను ఎంబీ బిఎస్ చదువుతుంది, నేను అగ్రికల్చర్ చదువుతాను. గోపీకిసన్ గారి దగ్గర బేసిక్స్ నేర్చుకున్నాను.

న‌టుడ్ని అవుదామ‌ని...
- నేను ఇండస్ట్రీకి హీరో అవ్వుదామని రాలేదు మంచి యాక్టర్ అవ్వాలని వచ్చాను. ఈ కథకి నేను బాగా కనెక్ట్ అయ్యాను. ప్రొడ్యూసర్ కి కూడా ఇది మొదటి చిత్రం. ఆయన ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా కలిసాను. ఇది రొటీన్ కధ మాత్రం కాదు. నా తర్వాత చిత్రానికి చర్చ‌లు జ‌రుగుతున్నాయి



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved