pizza
Giridhar Gopal press meet about Yamini Krishnamurthy biopic
ప్రముఖ నాట్యమణి 'యామిని కృష్ణమూర్తి' బయోపిక్ ను తెరకెక్కిస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా - దర్శకుడు గిరిధర్ గోపాల్
You are at idlebrain.com > news today >
Follow Us

10 July 2018
Hyderabad

తెలుగులో 'దివ్యమణి' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన గిరిధర్ గోపాల్, తన తదుపరి చిత్రంగా ప్రముఖ నాట్యమణి పద్మశ్రీ యామిని కృష్ణమూర్తి జీవిత కథను ఆధారంగా చేసుకొని బయోపిక్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. డైరెక్టర్ గిరిధర్ గోపాల్.

ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటిస్తూ.. "నా మొదటి చిత్రం "దివ్యమణి"ని ప్రేక్షకులు ఆదరించినందుకు మొదటగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ సినిమాను చూసిన వారందరూ బాగా మెచ్చుకున్నారు. నెగటివ్ గా ఎవరూ చెప్పలేదు. ఇక నా గురుంచి చెప్పాలంటే విశ్వనాధ్ గారు, డైరెక్టర్ లక్ష్మీ దీపక్ గారి దగ్గర, మరియు కెమెరామెన్ సత్తిబాబు గారి దగ్గర వర్క్ నేర్చుకున్నాను.. ఫోటో గ్రఫీ, మ్యూజిక్, విఎఫ్ఎక్స్ లపై నాకు మంచి పట్టు ఉంది.. చాలా యాడ్స్ కు పనిచేశాను. ఆ సమయంలోనే దివ్యమణి సినిమాకు దర్శకత్వం వహించాను.. ఇప్పుడు నా రెండవ చిత్రంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ నాట్య కళాకారిణి పద్మశ్రీ యామిని కృష్ణమూర్తి గారి బయోపిక్ ను తెరకెక్కించనున్నాము.. ఆవిడ నేటి తరానికి ఎంతో ఇన్స్పిరేషన్.. కూచిపూడి, భరతనాట్యం లలో తాను సాధించిన ప్రావీణ్యం ప్రపంచవ్యాప్తంగా తెలిసిందే.. అతి చిన్న వయసులోనే తనకు పద్మశ్రీ, పద్మ విభూషన్, పద్మభూషణ్ లాంటి ఎన్నో అవార్డ్స్ అంది వచ్చాయి.. అలాంటి మహోత్తరమైన యామిని గారి జీవిత కథను అందరికీ తెలియచేయాలనే ఉద్దేశ్యంతో ఎంతో రీసెర్చ్ చేసి, అన్నీ టెక్నికల్ అంశాలపై సాధన చేసిన తరువాతే సినిమా గా రూపొందించాలని నిర్ణయం త్వేసుకున్నాను.. ఇక ఈ చిత్ర కాస్టింగ్ విషయానికి వస్తే.. బాలీవుడ్, కోలీవుడ్ కు సంబంధించిన ప్రముఖ నటీనటులను పరీశీలించుతున్నాం.. యామిని గారే తన బయోపిక్ కు కొరియోగ్రఫీ అందించనుండటం విశేషం.. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఇంటర్నేషనల్ లెవెల్ లో తెరకెకించనున్నాము. బేసిక్ గా నాకు సాహిత్యం అంటే చాలా ఇష్టం కనుక నేనె ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసి, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నా.. 10-20 రోజుల్లో ఈ బయోపిక్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలియచేస్తాము" అని చెప్పారు.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved