pizza

Good Luck Sakhi Trailer is attractive
‘మీరింకా పెండ్లెందుకు సేసుకోలే..’... అంటూ అమాయకంగా అడిగేసిన కీర్తి సురేష్.. ఆకట్టుకుంటున్న ‘గుడ్ లక్ సఖి’ ట్రైలర్

You are at idlebrain.com > news today >
Follow Us

24 January 2022
Hyderabad

‘మహానటి’తో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గుడ్ లక్ సఖి’. క్రీడా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనున్నారు. ఇందులో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి ఈ చిత్రాన్ని నిర్మించారు. నగేష్ కుకునూన్ దర్శకుడు. జనవరి 28న సినిమా విడుదలవుతుంది. సోమవారం ‘గుడ్ లక్ సఖి’ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. ‘గుడ్ లక్ సఖి’లో ప్రధాన కథాంశం ఎంట‌నే విష‌యాన్ని రివీల్ చేసేశారు. ఓ మారుమూల ప‌ల్లెటూరులో ఉండే అమ్మాయి స‌ఖి (కీర్తి సురేష్‌). దేవుడు అంద‌మైన రూపాన్ని ఇచ్చాడు కానీ అవ‌గింజంత అదృష్టాన్ని ఇవ్వ‌లేద‌ని ఆమె బాధ‌ప‌డుతుంటుంది. అందుకు కార‌ణం.. ఆమె చేసే ప‌నులేవీ అనుకున్న‌ట్లు జ‌ర‌గ‌క‌పోవ‌డ‌మే. అలాంటి అమ్మాయిని ప్రేమించే ఓ అబ్బాయి (ఆది పినిశెట్టి). సఖిని ఊళ్లో అంద‌రూ బ్యాడ్ ల‌క్ స‌ఖి అంటుంటారు. అయితే ఆమెను ప్రేమించే అబ్బాయి మాత్రం ఆమెకు స‌పోర్ట్ చేస్తూ ఉంటాడు. స‌ఖి మంచి గురి ఉంటుంది. ఏ వ‌స్తువునైనా గురి త‌ప్ప‌కుండా కొట్టేస్తుంటుంది. విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన ఆమె ప్రియుడు ఆమెను ఓ వ్య‌క్తి (జ‌గ‌ప‌తి బాబు) ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్తాడు.

దేశం గ‌ర్వించే షూట‌ర్స్‌ను త‌యారు చేయాల‌నుకునే ఆ వ్య‌క్తి ఆమెను షూటర్‌గా త‌యారు చేస్తాడు. మ‌రి బ్యాడ్ ల‌క్ స‌ఖి దేశం గ‌ర్వించే గుడ్ ల‌క్ స‌ఖిగా ఎలా మారింది. ఈ క్ర‌మంలో ఆమెకు ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి. వాటిని ఆమె ఎలా అధిగ‌మించింది? అనే విష‌యాల‌ను ట్రైలర్‌లో సింపుల్‌గా, చ‌క్క‌గా చూపించారు. సినిమాలోని కామెడీ యాంగిల్‌ను ఎలివేట్ చేయ‌డ‌మే కాదు.. సినిమాకు ప్ర‌ధాన‌మైన ఎమోష‌న‌ల్ యాంగిల్‌ను ద‌ర్శ‌కుడు న‌గేష్ చ‌క్క‌గా ఆవిష్క‌రించిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది. రాహుల్ రామ‌కృష్ణ త‌న మాట‌ల‌తో కీర్తి సురేష్‌ను ఇబ్బంది పెట్ట‌టం. అందుకు ఆమె రాహుల్‌ని చిత‌క బాద‌టం.. రైఫిల్ షూటింగ్‌లో స‌క్సెస్ కాలేక బాధ‌ప‌డుతున్న‌ప్పుడు కోచ్ ఆమెకు ధైర్యం చెప్ప‌డం.. ఆమె విజ‌యం సాధించ‌డంతో పాటు ట్రైల‌ర్ చివ‌ర‌లో నువ్వు న‌న్ను పెళ్లి చేసుకుంటావా? అంటూ కీర్తి సురేష్ చెప్పే డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది. మ‌రి పూర్తి స్థాయి గుడ్ ల‌క్‌ సినిమాను ఎంజాయ్ చేయాలంటే మాత్రం జ‌న‌వ‌రి 28 వ‌ర‌కు ఆగాల్సిందే మ‌రి.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved