pizza
Gopi Ganesh interview (Telugu) about Bluff Master
మా సినిమా థియేటర్‌కొచ్చే ప్రేక్షకులను బ్లఫ్‌ చేయదు - గోపీగణేష్‌
You are at idlebrain.com > news today >
Follow Us

22 December
Hyderabad

శ్రీదేవి మూవీస్‌ సంస్థ అధినేత శివలెంక క ష్ణప్రసాద్‌ సమర్పణలో, అభిషేక్‌ ఫిలిమ్స్‌ అధినేత రమేష్‌ పిళ్లై నిర్మాతగా తమిళంలో ఘనవిజయం సాధించిన 'చతురంగ వేట్టై'ని ఆధారంగా చేసుకుని గోపీ గణేష్‌ పట్టాబి దర్శకత్వంలో.. తెలుగులో రూపొందిన చిత్రం 'బ్లఫ్‌ మాస్టర్‌'. 'జ్యోతిలక్ష్మీ', 'ఘాజి' చిత్రాల ఫేమ్‌ సత్యదేవ్‌ హీరోగా నటించారు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నందితా శ్వేత ఇందులో నాయిక. డిసెంబర్‌ 28న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గోపీ గణేష్‌ పట్టాబి ఇంటర్వ్యూ విశేషాలు...

- నాకు యాడ్‌ ఏజెన్సీ ఉంది. సినిమా కథలను తయారు చేసుకుంటూ ఉంటాను. మరోవైపు యాడ్స్‌ డైరెక్ట్‌ చేస్తుంటాను. నేను సినిమాటోగ్రాఫర్‌ కావాలని సినిమాల్లోకి వచ్చాను. డైరెక్టర్‌గా 'రోమియో' నా తొలి సినిమా.

- ఈ కథకు ఇన్‌స్పిరేషన్‌ మా గురువుగారు తీసిన 'బిజినెస్‌మేన్‌' సినిమా. ఆ సినిమాలో హీరో బ్యాంగ్‌ ఓపెన్‌ చేసినప్పుడు హీరోకి, కమీషనర్‌కు మధ్య ఓ చిన్న డిస్కషన్‌ నడుస్తుంది. దాని ఆధారంగానే సోసైటీలోని మరో కోణంలో కథను తయారు చేసుకున్నారు.

- ఈ సినిమా చేయమని అన్నప్పుడు సినిమా చూశాను. నిర్మాతగారిని అడిగి, ఓరినల్‌ వెర్షన్‌ను డైరెక్ట్‌ చేసిన దర్శకుడు హెచ్‌.వినోద్‌గారిని కలిశాను. మాతృకతో కాకుండా చిన్న చిన్న చేంజస్‌ చేద్దామని అనుకున్నాం. అందుకనే వినోద్‌గారిని కలిశాను. ఆయన అప్పుడు 'ఖాకి' సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఆయన తన కథకు మా గురువు పూరిగారి సినిమానే ఇన్‌స్పిరేషన్‌ అని చెప్పినప్పుడు నాకు మాత్రమే రీమేక్‌ చేసే అర్హత ఉందని ఫీలయ్యాను.

- సత్యదేవ్‌ కంటే ముందు నలుగురైదుగురు హీరోలు ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చి వెళ్లారు. కథలో మెయిన్‌ హీరో ఓ కామన్‌ మేన్‌గా కనపడతారు. అందుకే ఆ సినిమా అందరికీ కనెక్ట్‌ అయ్యింది. మాతృక నుండి సోల్‌ను మాత్రమే తీసుకుని కథను తయారు చేసుకున్నాను. హీరో క్యారెక్టరైజేషన్‌ను మార్చుకుని రాసుకున్నాను. డైలాగ్స్‌ నేనే రాసుకున్నాను. అడిషనల్‌ డైలాగ్స్‌ సపోర్టింగ్‌ను కీలక సన్నివేశాలను పులగం చిన్నారాయణగారు అందించారు.

- ఈ సినిమా కోసం ముందుగా వేరే హీరోకు అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. కథతో పాటు ట్రావెల్‌ చేసే సమయంలో ఆయనతో చేస్తే కథను మార్చాలి. కాబట్టి కాన్ఫిడెన్స్‌ దెబ్బతింది. నేను సినిమా నుండి డ్రాప్‌ అయ్యి వెళ్లిపోయాను. వేరే దర్శకుడితో సినిమా చేయాలని నిర్మాతలు అనుకున్నారు. అయితే నాతో పాటు ఈ సినిమాకు వర్క్‌ చేసిన టీం సభ్యులు నా డైలాగ్స్‌కు ఫ్యాన్‌ అయ్యారు. పూరిగారు కూడా నా డైలాగ్స్‌ విని కచ్చితంగా విజిల్స్‌ పడతాయని కూడా అన్నారు. అలాగే ఇంత వర్క్‌ చేసి ఇప్పుడు డ్రాప్‌ కావడం ఎందుకు? అని నా టీం మెంబర్స్‌ అన్నారు కూడా.

- సత్యదేవ్‌తో మంచి అనుబంధం ఉంది. నాలుగైదు సార్లు ఈ ప్రాజెక్ట్‌లోకి తనను తీసుకు రావాలని ప్రయత్నించాను కూడా. బిజినెస్‌ టర్మ్స్‌లో నిర్మాతలు ఆలోచిస్తారు కదా!. అలాగే సినిమా అనౌన్స్‌మెంట్‌ రోజు నేను సత్యకు ఫోన్‌ చేశాను. అప్పుడు తను 'గువ్వా గోరింక' సినిమాతో బిజీగా ఉన్నాడు. అఖరి ప్రయత్నం చేద్దాం రమ్మని నేను తనను పిలిచాను. తనకు కూడా ఈ స్క్రిప్ట్‌ చాలా ఇష్టం. నేను ఫోన్‌ చేసిన రోజు మధ్యాహ్నంతను ఆఫీస్‌కు రాగానే కొన్ని డైలాగ్స్‌ రాసి టెస్ట్‌ షూట్‌ చేశాను. దాన్ని శివలెంక కృష్ణప్రసాద్‌గారికి చూపించాను. ఆయన చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అప్పుడు సత్యదేవ్‌ను నమ్మి ఆరోజు అనౌన్స్‌మెంట్‌ చేయకుండా ఆపారు. ఈ సినిమాకు సత్యదేవ్‌ యాప్ట్‌ అని నేను మొదటి నుండి నమ్మాను. దాన్ని సత్యదేవ్‌ తన నటనతో నెక్స్‌ట్‌ లెవల్‌కు తీసుకెళ్లి తను తప్ప ఎవరూ చేయలేరు అనేంత బాగా నటించారు. థియేటర్‌ నుండి బయటకు వచ్చే ప్రేక్షకుడు సత్యదేవ్‌ గురించి కచ్చితంగా మాట్లాడుకుంటాడు.

- ఆదిత్యమీనన్‌, బ్రహ్మాజీ, సిజ్జుమీనన్‌ ఇలా చాలా మంచి పాత్రల్లో నటించారు. ప్రతి పాత్రలో నటీనటులకంటే.. పాత్రలే కనపడతాయి. ఇందులో హీరో పేరు ఆకాశ్‌ విహారి. అంటే అకాశం అయితే.. అమ్మాయి పేరు అవని. అంటే భూమి. సినిమాలో హీరో చేసే మోసాలతో పాటు సమాంతరంగా వారిద్దరికీ సంబంధించిన కథ రన్‌ అవుతూ ఉంటుంది. డబ్బుంటే భూమి మీదనే స్వర్గం చూడొచ్చు అనుకునే టైప్‌.. అయితే డబ్బుకి, సంతోషానికి సంబంధం లేదు అని నమ్మే పాత్ర హీరోయిన్‌ది.

- సునీల్‌ కశ్యప్‌ ఎ.ఆర్‌.రెహమాన్‌గారి దగ్గర పనిచేశారు. సిచ్యువేషన్‌కు తగినట్లు.. ప్రేక్షకుడిని సినిమాలోకి తీసుకెళ్లి పోయేలా ఉండాలనుకుంటాను. ఆర్‌.ఆర్‌ చాలా కీ రోల్‌ పోషిస్తుంది. నేను తమ్ముడిగా భావించే సునీల్‌ కశ్యప్‌నే ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకొచ్చాను. సునీల్‌ తన సంగీతంతో సినిమాను నెక్స్‌ట్‌ లెవల్‌కు తీసుకెళ్లాడు సునీల్‌ కశ్యప్‌.

- ఇన్‌డైరెక్ట్‌గా, సెటైరికల్‌గా మంచి మెసేజ్‌ను చెప్పేంత స్కోప్‌ ఉన్న సినిమా ఇది. మంచి సినిమా. థియేటర్‌కొచ్చే ప్రేక్షకుడ్ని మా సినిమా బ్లఫ్‌ చేయదు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved