03 October -2020
Hyderabad
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా అద్భుతం గా ముందు కొనసాగుతుంది.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు చెన్నై లోని తన నివాసంలో మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ త్రిష ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలపడం జరిగింది.
వాతావరణం పరిరక్షణ మనందరి బాధ్యత కాబట్టి నా బాధ్యతగా నేను ఈరోజు మొక్కలు నాటాను అని మీరు కూడా ఇందులో పాల్గొని మొక్కలు నాటాలని అభిమానులకు పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.