pizza
Guntur Talkies release on 4 March
మార్చి 4న విడుదలవుతున్న ‘గుంటూరు టాకీస్’
You are at idlebrain.com > news today >
Follow Us

24 February 2016
Hyderaba
d

నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గుంటూర్‌ టాకీస్‌’ ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ, నరేష్‌ విజయ్‌కృష్ణ, రేష్మీ గౌతమ్‌, శ్రద్ధాదాస్‌, లక్ష్మీ మంచు, మహేష్‌ మంజ్రేకర్‌ ప్రధాన తారాగణంగా నటించారు. ఆర్‌.కె.స్టూడియోస్‌ బ్యానర్‌పై రాజ్‌కుమార్‌.ఎం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని మార్చి 4న గ్రాండ్ లెవల్ లో విడుదలవుతుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, వారాహిచలన చిత్రం అదినేత విడుదల చేస్తున్నారు. రీసెంట్ గా శ్రీచరణ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలకు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్ కు సంబంధించిన కథాంశం. ప్రవీణ్ సత్తారుగారు సినమాను డిఫరెంట్ జోనర్ లో ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని వారాహిచలనచిత్రం సాయికొర్రపాటిగారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని నిర్మాత రాజ్ కుమార్.ఎం తెలియజేశారు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved