pizza
Hangman first look
క్లోరో ఫిల్మి పిక్చర్స్ బ్యానర్‌పై విల‌క్ష‌ణ న‌టుడు బ్ర‌హ్మాజీ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న ‘హ్యాంగ్ మ్యాన్‘ షూటింగ్ పూర్తి.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌
You are at idlebrain.com > news today >
 
Follow Us

17 December -2020
Hyderabad

 




బ్ర‌హ్మాజీ.. తెలుగు సినీ ప్రేక్ష‌కాభిమానుల‌కు ప‌రిచయం అక్క‌ర్లేని పేరు. డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్‌.. డిఫ‌రెంట్ మేన‌రిజ‌మ్స్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకోవ‌డం ఆయ‌న‌కే చెల్లింది. ఇప్పుడు బ్ర‌హ్మాజీ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మ‌రో డిఫ‌రెంట్ మూవీ ‘హ్యాంగ్ మ్యాన్‌’.క్లోరో ఫిల్మి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నిర్మాణంలో విహాన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ బుధ‌వారం విడుద‌ల చేసింది. మెడ‌లో తాయాత్తు క‌ట్టుకుని, చేతిలో పెద్ద చేప ప‌ట్టుకుని కాస్త నెర‌సిన జుట్టుతో ఉన్న బ్ర‌హ్మాజీ లుక్ డిఫ‌రెంట్‌గా అనిపిస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించి మెప్పించిన బ్ర‌హ్మాజీ.. ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి త‌లారి పాత్ర‌ను హ్యాంగ్‌మ్యాన్ చిత్రంలో పోషిస్తున్నారు. క్రైమ్ డ్రామా జోన‌ర్‌లో రియ‌ల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా యూనిక్ ఐడియాతో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమా ట్రైల‌ర్, రిలీజ్ డేట్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర‌యూనిట్ స‌భ్యులు తెలిపారు.

న‌టీన‌టులు:
బ్ర‌హ్మాజీ, సుర‌భి ప్ర‌భావ‌తి, స‌న్నీ ప‌ల్లె, శ‌శిక‌ళ ధ‌ర్మ‌వ‌ర‌పు, స‌న్నీ న‌వీన్‌, విన‌య్ న‌ల్ల‌క‌డి, సాయికృష్ణ‌, న‌రేంద‌ర్ ఎన్‌జీ, రామ‌చంద్ర‌రావు, రామారావ్ జాద‌వ్‌, కృష్ణ కుంభ‌ర్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: విహాన్‌
నిర్మాణం: క్లోరో ఫిల్మి పిక్చ‌ర్స్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఉద‌య్ గుర్రాల‌
సంగీతం: కమ్రాన్‌
ఎడిట‌ర్‌: కార్తీక్ క‌ట్స్‌
కోడైరెక్ట‌ర్‌: అంజి స‌లాది
లైన్ ప్రొడ్యూస‌ర్‌: విన్సెంట్ ప్ర‌వీణ్‌
సౌండ్ డిజైన్‌: సింక్ సినిమా
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: ఉద‌య్ గుర్రాల‌
ఆర్ట్‌: క్రాంతి ప్రియం
కాస్ట్యూమ్స్‌: బి.వి.కృష్ణ‌
పి.ఆర్‌.ఓ: వంశీ కాక‌


 


 

 





   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved