pizza
Happy Birthday (25 December) to Parasuram
హ్యాపీ బ‌ర్త్ డే ప‌రుశురామ్..
You are at idlebrain.com > news today >
Follow Us

25 December 2016
Hyderaba
d

ప‌రుశురామ్.. ఈ త‌రం ద‌ర్శ‌కుల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు. చేసింది త‌క్కువ సినిమాలే అయినా.. వాటితోనే స్పెష‌ల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ప‌రుశురామ్. ముఖ్యంగా ర‌చ‌యిత‌గా గురువు పూరీనే మించిపోయే విధంగా పేరు తెచ్చుకుంటున్నాడు ప‌రుశురామ్. యువ‌త లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు ప‌రుశురామ్. హీరో నిఖిల్ కు సోలో హీరోగా ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా ఇదే. ఆ త‌ర్వాత ఆంజ‌నేయులుతో ర‌వితేజ‌లోని ఎన‌ర్జీని అదిరిపోయేలా చూపించాడు ఈ ద‌ర్శ‌కుడు. ఆంజ‌నేయులు సినిమాలో ప‌రుశురామ్ రాసిన కామెడీ చ‌మ‌క్కులు ఇప్ప‌టికీ సెన్సేష‌నే.

ఇక సోలో సినిమాతో కుటుంబ ప్రేక్ష‌కుల్ని కూడా త‌న‌దైన రీతిలో అల‌రించాడు ఈ ద‌ర్శ‌కుడు. నారా రోహిత్ కు హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసాడు. అందులో మాస్ ప్రేక్ష‌కుల్ని అల‌రించే విధంగా క‌థ‌ను న‌డిపిస్తూనే.. కుటుంబ విలువ‌ల‌కు పెద్ద‌పీట వేసాడు ప‌రుశురామ్. ఇక ర‌చ‌యిత‌గా ఆయ‌న ఇమేజ్ ను మ‌రింత ఎత్తుకు చేర్చింది సోలో. సారొచ్చారుతో ర‌వితేజ‌లోని మ‌రో కోణాన్ని బ‌య‌టికి తీసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ త‌రం ద‌ర్శ‌కులు ఎవ‌రూ పెద్ద‌గా సాహ‌సించ‌ని పెళ్లి, ప్రేమ కాన్సెప్ట్ ను త‌న‌దైన రీతిలో చెప్పాడు ప‌రుశురామ్.

ఇక ఈ ఏడాది శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తుతో సూప‌ర్ హిట్ అందుకున్నాడు ప‌రుశురామ్. అల్లు శిరీష్ తో మంచి విజయం అందుకున్నాడు. ముఖ్యంగా ఆయ‌న‌తో చెప్పించిన డైలాగులు ప‌రుశురామ్ లోని ర‌చ‌యిత ప‌వ‌ర్ తెలియ‌జేస్తాయి. దేవున్ని కొంద‌రు ద‌గ్గ‌ర్నుంచి చూస్తారు.. కొంద‌రు దూరం నుంచి చూస్తారు.. ఆయ‌న మాత్రం అంద‌ర్నీ అక్క‌డ్నుంచే చూస్తాడు అని ప‌రుశురామ్ రాసిన కొన్ని డైలాగ్స్ సూప‌ర్ గా పేలాయి. గీతాఆర్ట్స్ లో శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి హిట్ సినిమా చేసిన ప‌రుశురామ్.. వెంట‌నే మ‌రో అవ‌కాశం అందుకున్నాడు. అంత ఈజీగా ఎవ‌రికీ రెండో అవ‌కాశం ఇవ్వ‌ని అల్లు అర‌వింద్.. ఈ ద‌ర్శ‌కుడి టాలెంట్ తెలిసి మ‌రో ఆఫ‌ర్ ఇచ్చేసాడు. త్వ‌ర‌లోనే ప్రముఖ హీరోతో ప‌రుశురామ్ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ పుట్టిన‌ రోజును శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు అంటూ స‌క్సెస్ ఫుల్ గా జ‌రుపుకున్న ప‌రుశురామ్.. ఇలాగే ఎన్నో హ్యాపీ బ‌ర్త్ డేలు జ‌రుపుకోవాల‌ని ఆశిద్ధాం..!


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved