pizza
Harish Shankar’s Seeti Maar
హ‌రీష్ శంక‌ర్ దర్శకత్వం లో `సీటీమార్‌`
You are at idlebrain.com > news today >
Follow Us

22 February 2018
Hyderabad


 `గ‌బ్బ‌ర్ సింగ్‌`తో ఇండ‌స్ట్రీ హిట్ కొట్టిన డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సూప‌ర్‌హిట్ చిత్రం `దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌`లోని `సీటీ మార్ సీటీ మార్‌.. ` అనే సాంగ్ ఎంత పాపులార్ అయ్యిందో మ‌న‌కు తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన సినిమాలో హిట్ సాంగ్‌లోని `సీటీమార్` అనే టైటిల్‌తో త్వ‌ర‌లోనే ఓ సినిమా తెరకెక్క‌నుండ‌టం విశేషం.   హరీష్ శంక‌ర్.. ప్ర‌స్తుతం దిల్‌రాజు బ్యాన‌ర్‌లో `దాగుడుమూత‌లు` అనే సినిమాను రూపొందించే ప‌నిలో భాగంగా స్క్రిప్ట్ వ‌ర్క్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తికాగానే `జ‌వాన్` చిత్రాన్ని నిర్మించిన అరుణాచ‌ల్ క్రియేష‌న్స్ ప‌తాకంపై కొమ్మ‌ల‌పాటి కృష్ణ నిర్మాణంలో హీర‌ష్ శంక‌ర్‌ `సీటీమార్‌` సినిమాను డైరెక్ట్ చేస్తారు. ఈ సినిమాలో వ‌రుస హిట్స్ సాధిస్తున్న యువ క‌థానాయ‌కుడు ఈ సినిమాలో హీరోగా న‌టించనున్నారు.త్వ‌ర‌లోనే చిత్ర యూనిట్ పూర్తి వివ‌రాల‌ను తెలియ‌జేస్తుంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved