pizza
Havish Birthday (25 June) interview 2017
సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను - హవీష్‌
You are at idlebrain.com > news today >
Follow Us

24 June 2017
Hyderabad

'నువ్విలా', 'రామ్‌లీల', 'జీనియస్‌' వంటి చిత్రాలతో మెప్పించిన హీరో హవీష్‌. అమెరికాలో చదువుకున్న ఈ యువ హీరో ఒక వైపు వ్యాపారం, మరోవైపు సినిమాలను బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకెళుతున్నాడు. ప్రస్తుతం హవీష్‌ హీరోగా జవహర్‌బాబు, రమేష్‌ వర్మ నిర్మాతలుగా ఓ సినిమా రూపొందుతుంది. సాయి అనే నూతన దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. హీరో హవీష్‌ పుట్టినరోజు జూన్‌ 25. ఈ సందర్భంగా హవీష్‌ పాత్రికేయులతో మాట్లాడారు.

హీరో హవీష్‌ మాట్లాడుతూ - ''నేను అమెరికాలో చదువు పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత చిన్నికృష్ణగారితో ఓ సినిమా చేసే అవకాశం వచ్చింది. కానీ కొన్ని కారణాలతో నేను ఆ సినిమా చేయడానికి వీలుపడలేదు. అప్పుడే సినిమాలపై ఉన్న ఆసక్తి ఇంకా బలపడింది. దాంతె వైజాగ్‌ సత్యానంద్‌గారి దగ్గర ఆరు నెలలు పాటు శిక్షణలో ట్రయినింగ్‌ తీసుకున్నాను. తర్వాత రవిబాబుగారి దర్శకత్వంలో 'నువ్విలా' మూవీ చేశాను. తర్వాత ఓంకార్‌గారి దర్శకత్వంలో 'జీనియస్‌' సినిమా చేశాను. నువ్విలా, జీనియస్‌ చిత్రాల్లో నాకు మంచి పేరు వచ్చింది. కానీ 'రామ్‌లీల' అనుకున్నంత సక్సెస్‌ కాలేదు.

Havish Birthday interview gallery

ఇప్పుడు సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. కథ నచ్చితేనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు జవహర్‌బాబుగారు, రమేష్‌వర్మగారు సంయుక్తంగా నిర్మించే సినిమాలో నటిస్తున్నాను. సాయి అనే కొత్త దర్శకుడు సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నారు. ఇది కామెడి థ్రిల్లర్‌. ఇందులో కథే హీరో. నా క్యారెక్టరైజేషన్‌ డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమాలో దుగురు హీరోయిన్స్‌ ఉంటారు. తెలుగు, తమిళంలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్స్‌ చేస్తున్నారు. కమర్షియల్‌గా సినిమా ఆడియెన్స్‌ను అలరిస్తుంది. జవహర్‌బాబుగారి ప్రొడక్షన్‌లోనే నా నెక్స్‌ట్‌ మూవీ కూడా ఉంటుంది. నటుడిగా ఎలాంటి పాత్రలైనా చేయడానికి సిద్ధం. నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలు చేస్తాను. వేరే హీరోలున్న సినిమాలో ఇప్పట్లో నటించను'' అన్నారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved