pizza
Hello Guru Prema Kosame Audio Launched - Trailer On Oct 10th
`హ‌లో గురు ప్రేమ‌కోస‌మే` పాటలు విడుద‌ల‌. అక్టోబర్ 10న ట్రైలర్ విడుదల.
You are at idlebrain.com > news today >
Follow Us

08 October 2018
Hyderabad

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు సమర్పణ లో శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలు గా త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం లో రూపొందుతోన్న ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ `హ‌లో గురు ప్రేమ కోస‌మే`. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ప్ర‌ణీత హీరోయిన్స్‌గా న‌టించారు. `సిసనిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్` వంటి హిట్‌ చిత్రాల ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ క్యూట్ అండ్ సెన్సిబుల్ ల‌వ్ స్టోరీకి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలోని పాట‌లు నేడు మార్కెట్లోకి విడుద‌ల‌య్యాయి. సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 18న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ...

హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ - ``సినిమాకు సంబంధించిన టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగాయి. రామ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ప్ర‌ణీత కెమిస్ట్రీ ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేస్తుంది. మా బ్యాన‌ర్‌లో ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌కు సంగీతం అందించిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పాట‌లు మార్కెట్లోకి విడుద‌ల‌య్యాయి. సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తుంది. ఈ నెల 10న థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తున్నాం. అలాగే అక్టోబ‌ర్ 13న వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను నిర్వ‌హిస్తున్నాం. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 18న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్‌రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.

ఈ చిత్రానికి విజ‌య్ కె.చ‌క్ర‌వ‌ర్తి సినిమాటోగ్ర‌ఫీ, సాహి సురేశ్ ఆర్ట్ వ‌ర్క్‌, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వ‌ర్క్ అందిస్తున్నారు.బెజ‌వాడ ప్ర‌స‌న్న‌కుమార్ మాట‌లు.. ర‌చ‌న స‌హ‌కారం సాయికృష్ణ అందిస్తున్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved