pizza
Honorary doctorate to Naresh
న‌రేష్‌కు గౌర‌వ డాక్ట‌రేట్‌
You are at idlebrain.com > news today >
Follow Us

06 March 2016
Hyderaba
d

సీనియ‌ర్ న‌రేష్‌కు న్యూయార్క్ కు చెందిన అకాడ‌మీ ఆఫ్ యూనివ‌ర్శ‌ల్ గ్లోబ‌ల్ పీస్ గౌర‌వ డాక్ట‌రేట్‌ను అంద‌జేసింది. దీని గురించి సీనియ‌ర్ న‌రేష్ హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు.

న‌రేష్ మాట్లాడుతూ ``సౌత్ ఇండియాలో నాకూ, క‌ర్ణాట‌క‌కు చెందిన ఓ భ‌ర‌త‌నాట్య క‌ళాకారిణికి గౌర‌వ డాక్ట‌రేట్ల‌ను అంద‌జేశారు. ఈ డాక్ట‌రేట్‌ను నాకు న‌ట‌న నేర్పిన జంధ్యాల‌గారికి, విజ‌య‌నిర్మ‌ల‌గారికి, నాకు పిల్ల‌ర్‌గా స‌పోర్ట్ చేసిన కృష్ణ‌గారికి, తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌కు అంకితం చేస్తున్నాను. ఇటీవ‌లే తెలంగాణ స్పీక‌ర్ చేతుల మీదుగా న‌వ‌ర‌స‌రాయ అనే బిరుదును కూడా అందుకున్నాను.కృష్ణ‌గారి గోల్డెన్ జూబ్లీ జ‌రుగుతున్న ఈ త‌రుణంలో ఆయ‌న న‌టిస్తున్న శ్రీ శ్రీ సినిమాలో నేను కూడా ఓ పాత్ర‌ను పోషించాను. ఈ సినిమాలో నా టైటిల్ కార్డును ముప్ప‌ల‌నేని శివ కొత్త‌గా వేశారు. న‌వ‌ర‌స‌రాయ డాక్ట‌ర్ న‌రేష్ అని టైటిల్ కార్డు ప‌డనుంది. ఈ గౌర‌వ డాక్ట‌రేట్‌తో న‌టుడిగా, పౌరుడిగా నా బాధ్య‌త పెరిగింది. ఈ ఏడాది నేను న‌టించిన నేను శైల‌జ సినిమా విడుద‌లైంది. చిత్రం భ‌ళారే విచిత్రం, మీ శ్రేయోభిలాషి, అంద‌రి బంధువ‌య సినిమాల త‌ర్వాత ఆ స్థాయిలో నేను న‌టించిన సినిమా `గుంటూరు టాకీస్‌`. ఈ సినిమా యువ‌త‌కు ద‌గ్గ‌రైంది. జోన‌ర్ సినిమా ఇది. ఎ స‌ర్టిఫికెట్ ఉంది. కాస్త ఎరోటిక్‌గానూ అనిపిస్తుంది. సింగిల్ స్క్రీనుల్లో బాగా ఆడుతోంది. యూత్‌కి న‌చ్చిన మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌.

ఈ సినిమా న‌న్ను మ‌రో 10 మెట్లు పైకి తీసుకెళ్లే సినిమా అయింది. ఫ్యాన్స్ ఎంత‌కాలంగానో ఎదురుచూస్తున్న‌ట్టు మ‌హేష్‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం బ్ర‌హ్మోత్స‌వంలో వ‌చ్చింది. త్రివిక్ర‌మ్ సినిమా కూడా మంచి పేరు తెస్తుంది. వీరుపోట్ల ద‌ర్శ‌క‌త్వంలో సునీల్ హీరోగా న‌టిస్తున్న సినిమాలోనూ మంచి పాత్ర చేస్తున్నాను. మ‌రో ఐదారు ప్రాజెక్టులు డిస్క‌ష‌న్ స్టేజీలో ఉన్నాయి. వాటిలో తమిళ్‌, తెలుగు బై లింగ్వుల్ ఒక‌టి ఉంది. డ‌బ్బు కోసం కాకుండా, మంచి స‌బ్జెక్ట్ ఉన్న సినిమాల‌ను ఒప్పుకుంటున్నాను`` అని చెప్పారు.

Naresh gallery

 


Photo Gallery
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved